తెలంగాణ ఎడ్సెట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. అప్లికేషన్లతో పాటు, ఎగ్జామ్ తేదీల షెడ్యూల్ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈసారి మహాత్మగాంధీ యూనివర్సిటీ ఈ ఎంట్రన్స్ నిర్వహిస్తుంది. మే 18న ఎడ్సెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మార్చి 6వ తేదీ నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తారు. యూనివర్సిటీలు, కాలేజీల్లో రెండేళ్ల బీఈడీ కోర్సులో చేరేందుకు ఈ ఎంట్రన్స్ నిర్వహిస్తారు. డిగ్రీ పాసైన అభ్యర్థులు, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు బీఈడీ ఎంట్రన్స్ రాసేందుకు అర్హులు. భవిష్యత్తులో టీచర్ జాబ్ సాధించాలనుకునే వారందరూ బీఈడీ, లేదా డీఈడీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే బీఈడీ కోర్సుకు డిమాండ్ ఎక్కువ.
Name of the CET | TS EdCET 2023 |
---|---|
Title | Apply for TS EdCET 2022 |
Subject | Osmania University has released TS EdCET notification 2023 |
Category | Entrance Test |
Applications Starts from | 06-03-2023 (Online) |
Last Date to Apply | 20-04-2023 |
Exam Fee | Rs 750 (Exemption for SC, ST, PH) |
TS EdCET Exam Date | 18-05-2023 |
Official Website | edcet.tsche.ac.in |
అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ తో పాటు రూ.750 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి. ఏప్రిల్ 20వ తేదీ వరకు అప్లికేషన్లకు తుది గడువుగా నిర్ణయించారు. లేట్ ఫీతో ఏప్రిల్ 25వ తేదీ వరకు అప్లై చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మే 5వ తేదీ నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసిన డిటైల్డ్ నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ యథాతథంగా అందించనైనది.