నేటి ఉద్యోగ ప్రపంచంలో కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్), మెషీన్ లెర్నింగ్, కోడింగ్ ల హవానే నడుస్తోంది. వీటిలో మంచి స్కిల్స్ ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ఈ ఉద్యోగాలకు కూడా ఏఐ నుంచి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కానీ ఓ స్కిల్ ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏఐ భర్తీ చేయలేదని అమెరికాకు చెందిన మార్కెటింగ్ ప్రొఫెసర్ స్కాట్ గాల్లోవే అంటున్నారు. అదేంటో తెలుసా స్టోరీ టెల్లింగ్.
స్టోరీ టెల్లింగ్ స్కిల్:
న్యూయార్క్ లోని ఓ యూనివర్సిటీలో మార్కెటింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న స్కాట్ గాల్లేవే సొంతంగా ఓ కంపెనీని స్థాపించారు. ఇప్పుడు ఆ కంపెనీ విజయవంతంగా నడుస్తోంది. తర్వాత దానిని నుంచి 130 మిలియన్ డాలర్ల వరకు భారీగా లాభాలను ఆర్జించారు. నేటి తరం యువత కోసం కొన్ని కీలక విషయాలను కూడా తెలిపారు. ఉద్యోగం కోసం ప్రయత్నించే అభ్యర్థులకు స్టోరీ టెల్లింగ్ నైపుణ్యం చాలా ముఖ్యమైందని తెలిపారు. ఇది తన అనుభవంతో చెబుతున్న మాట అని వివరించారు. పూర్తిగా టెక్నాలజీపైనే ఆధారపడుతున్న ఈ రోజుల్లో మన మనస్సులో ఉన్నది అత్యంత ప్రభావవంతంగా చెప్పగలడం చాలా కీలకమన్నారు. తగిన సమాచారం చిత్రాలు, ఇన్ఫో గ్రాఫిక్స్ తోపాటు మన ఆలోచనలను కూడా వ్యక్తపర్చడం, వాటిని ఇతరులకు అవగాహన కల్పించడం అవసరమన్నారు.
అసలు విషయం ఏంటంటే కమ్యూనికేషన్ మాధ్యమాలు మార్చవచ్చు కానీ చెప్పే విధానాన్నికి మాత్రం ఎప్పుడూ ప్రాధాన్యం అనేది తగ్గదు అన్నారు. అందుకే ఈ స్టోరీ టెల్లింగ్ అనేది ఎప్పటికీ కాలం చెల్లని ప్రత్యేకమైన స్కిల్ అని ఆయన వివరించారు. నేటి యువత చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్ పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. కానీ ఇది ప్రయోజకరమైన అలవాటు కాదని స్కాట్ హెచ్చరిస్తున్నారు. ఏఐ, కోడింగ్ అవసరమైనప్పటికీ స్టోరీ టెల్లింగ్ లాంటి విలువైన స్కిల్స్ ను పెంపొందించుకోవాలని స్పష్టం చేశారు. ఒక బ్రాండ్ ప్రతిష్టను పెంచడం లేదా తగ్గించడం అనేది స్టోరీ టెల్లింగ్ పై ఆధారపడి ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో చాట్ జీపీటీ వంటి అత్యాధుని టెక్నాలజీలు కూడా కనుమరుగయ్యే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. న్యూరల్ నెట్ వర్క్ వంటి సరికొత్త టెక్నాలజీలు ఇప్పుడు తెరపైకి వచ్చే అవకాశం ఉందని అప్పుడుకోడింగ్ కు పూర్తి ప్రాధాన్యం తగ్గుతుందన్నారు. కానీ స్టోరీ టెల్లింగ్ స్కీల్ కు ఎప్పుడూ కాలం చెల్లదని..ఈ కీలక నైపుణ్యాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని స్కాట్ సూచించారు.