ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఢిల్లీలో సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ(Central Medical Services Society)..కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్టుల వారిగా విద్యార్హతలు కూడా నిర్ణయించింది. అర్హతతోపాటు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎన్ని పోస్టులు ఉన్నాయి?విద్యార్హతలు ఏమిటి?ఏ పోస్టుకు ఎంత జీతం? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మొత్తం పోస్టుల సంఖ్య -15
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ప్రొక్యూర్‌మెంట్) – 02
అసిస్టెంట్ జనరల్ మేనేజర్(క్వాలిటీ అస్యూరెన్స్) – 01
అసిస్టెంట్ జనరల్ మేనేజర్(లాజిస్టిక్స్ & సప్లై చైన్ విభాగం) – 01
అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఫైనాన్స్) – 01
మేనేజర్(ప్రొక్యూర్‌మెంట్) – 02
మేనేజర్(లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్) – 02
మేనేజర్ (ఫైనాన్స్) – 02
మేనేజర్(క్వాలిటీ అస్యూరెన్స్) – 02
వేర్ హౌస్ మేనేజర్(ఫార్మాసిస్ట్)- 01
ఆఫీస్ అసిస్టెంట్ – 01
అర్హతలు:
కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రకటించిన సీఎంఎస్ఎస్ 2024 నోటిఫికేషన్ లో ఖాళీలు ఉన్న పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతోపాటు పనిచేసిన అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలి.