తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసులో జూనియర్ విభాగంలో సివిల్ జడ్జీ పోస్టుల భర్తీకి హైదరాబాద్ లోని తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 150 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనిలో 2024 సంవత్సరానికి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 31 ఖాళీలు, బదిలీ ద్వారా 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 2024,2025 సంవత్సరాలకు గాను డైరెక్టు రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 90ఖాళీలు, బదిలీల ద్వారా 14ఖాళీలు భర్తీ చేస్తారు.
తెలంగాణ జ్యుడీషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్దేశించిన అర్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలున్నావారు మే 17లోగా ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి. స్క్రీనింగ్ టెస్ట్ రాత పరీక్ష , వైవా-వాయిస్ టెస్ట్ ద్వారా సెలక్ట్ చేస్తారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్,ఖమ్మంలో పరీక్షను నిర్వహిస్తారు.
జూనియర్ సివిల్ జడ్జీ పోస్టులు:
మొత్తం ఖాళీల సంఖ్య: 150.