మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డవలప్మెంట్ విభాగంలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (https://www.tspsc.gov.in/) కీలక ప్రకటన చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల 12వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 6వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.
అభ్యర్థులు పరీక్ష కు 45 నిమిషాలకు ముందు వరకు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని కమిషన్ వెల్లడించింది. చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా.. అభ్యర్థులు సాధ్యమైనంత ముందుగా తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపింది. పరీక్షకు వెళ్లే ముందు అభ్యర్థులు హాల్ టికెట్ పై పొందు పరిచిన నిబంధనలను చదువుకోవాలని అధికారులు సూచించారు.