కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ దళాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్ ను యూపీఎస్సీ ఏప్రిల్ 24న రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 506 ఖాళీలను భర్తీ చేయనుంది.ఈ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 24న ప్రారంభమైంది. మే 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు ఉన్న స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్ట్స్ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్ష, మెడికల్ ఎగ్జామినేష్న, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 4వ తేదీన రాతపరీక్షన నిర్వహిస్తారు. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు తొలిసెషల్ లో పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సేషన్ లో పేపర్ 2 పరీక్షను నిర్వహిస్తారు. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలో ఈ పరీక్షను నిర్వహిస్తారు.
మొత్తం ఖాళీలు : 506 పోస్టులు
బీఎస్‌ఎఫ్: 186 పోస్టులు