నవోదయ విద్యాలయ సమితిలో 1377 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తులు రేపటితో ( ఏప్రిల్ 30) తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు వెంటనే అప్లయ్ చేసుకోండి. పోస్టుల వారీగా విద్యార్హతలు వయోపరిమితుల గురించి నోటిఫికేషన్ లో పొందుపరిచిన సంగతి తెలిసిందే. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించి ఫిమేల్ స్టాఫ్ నర్సు పోస్టులకు రూ. 1500, ఇతర పోస్టులకు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 500 చెల్లించాలి.
రాతపరీక్ష, ట్రేడ్, స్కిల్ టెస్టు, ఇంటర్వ్యూ, డాక్యమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలక్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖ, విజయవాడ, గుంటూరు,నెల్లూరు, కాకినాడ, అనంతపురం, కర్నూలు, తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మంలో నిర్వహిస్తారు.
ఈ నోటిఫికేన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న జవనహర్ నవోదయ విద్యాలయాల హెడ్ క్వార్టర్స్ లలో నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో 1,337 పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో హెడ్ క్వార్టర్స్ లలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్ , జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు, నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో స్టాఫ్ నర్సు, కేటరింగ్ సూపర్ వైజర్ , జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ ఫ్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తారు.
మొత్తం ఖాళీల సంఖ్య: 1377.