అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలా? యూజీసీ నెట్ 2024 అప్లై చేయండి
యూజీసీ నెట్ (UGC NET 2024) పరీక్ష కోసం నోటిఫికేషన్ (NOTIFICATION) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు పీహెచ్డీ చేసేందుకు ఎంతో కీలకమైంది. యూజీసీ నెట్ లో ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారికి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ లభిస్తుంది.
మొత్తం 83 సబ్జెక్టులు:
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్ష మొత్తం 83 సబ్జెకులకు ఉంటుంది. ప్రతిఏటా రెండు సార్లు ఈ ఎగ్జామ్ ను నిర్వహిస్తారు. ఈసారి యూజీసీ నెట్ పరీక్షను జూన్ 16 నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తెలిపింది.
ఏయే సబ్జెక్టులు ఉంటాయి:
-ఆంథ్రోపాలజీ
-అడల్ట్ ఎడ్యుకేషన్
-అరబ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ స్టడీస్
-అస్సామీ
-అరబిక్
-ఆర్కియాలజీ
-బోడో
-బెంగాలీ
-బౌద్ధ
-జైన
-చైనీస్
-కామర్స్
-కంప్యూటర్ సైన్స్ అండ్
-క్రిమినాలజీ
-జాగ్రఫీ
-ఎకనామిక్స్
-ఇంగ్లీష్
-హిస్టరీ
-హోం సైన్స్
-ఫోరెన్సిక్ సైన్స్
-ఇండియన్ కల్చర్
-లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్
-లింగ్విస్టిక్స్
-మ్యూజిక్
-సైకాలజీ, లా
మొదలైన 83 సబ్జెక్టులు ఉంటాయి.
అర్హతలు:
అభ్యర్థులు 55శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి.
వయస్సు:
-జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందాలంటే అభ్యర్థుల వయస్సు 2024 జూన్ 1 నాటికి 30ఏళ్ల లోపు ఉండాలి.
-అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీకి ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు.
పరీక్ష ఎలా ఉంటుందంటే:
అభ్యర్థులకు ఓఎమ్మార్ షీట్ ఇస్తారు. ఇందులో మీరు జవాబులను బబుల్ చేయాలి. యూజీసీ నెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలోనూ ఆబ్జెక్టివ్ అండ్ మల్టిపుల్ ఛాయిల్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 1లో 50 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 100 మార్కులు. పేపర్ 2 లో 100 ప్రశ్నలు. వీటికి 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 3గంటలు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
జనరల్, అన్ రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 1150 చెల్లించాలి. ఈ డబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్ సీఎల్ అభ్యర్థులు రూ. 600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్లు రూ. 325 చెల్లించాలి.
ఏపీ, తెలంగాణలో పరీక్ష కేంద్రాలు:
అమరావతి, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. హైదరాబాద్, సికింద్రాబాద్, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.
ముఖ్యమైన తేదీలు:
-ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 ఏప్రిల్ 20
-దరఖాస్తులకు చివరి తేదీ : 2024 మే 10
-దరఖాస్తు సవరణ తేదీలు : 2024 మే 13 నుంచి 15 వరకు
-పరీక్ష తేదీ: 2024 జూన్ 16