Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSతెలంగాణ ఉద్యమం 2 (1971 ముందు)

తెలంగాణ ఉద్యమం 2 (1971 ముందు)

  • తెలంగాణలో అతి పెద్ద సంస్థానం గద్వాల సంస్థానం. ఈ సంస్థానం కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య ఉన్నది. ఈ సంస్థాన మూల పురుషుడు బుడ్డారెడ్డి. గద్వాల కోట నిర్మాత పెదసోమ భూపాలుడు (శోభనాద్రి). ఇతడినే జానపద కథకుడు నల్ల సోమనాద్రి అంటారు.
  • →పాపన్నపేట సంస్థాన పాలకురాలైన ‘రాణి శంకరమ్మ’కు ‘రాయ్ బాగన్’ అనే బిరుదు ఉంది.
  • → ఈమె దళితుడైన నీరుడి పాపన్నను ప్రధాన దళపతిని చేసింది.
  • → ‘జటప్రోలు’ సంస్థాన మూల పురుషుడు మాదానాయుడు.
  • →నిజామాబాద్ కోటను రాష్ట్ర కూట రాజులు కట్టించారు.
  • 1958 ఫిబ్రవరి 01 తెలంగాణ రీజినల్ కమిటి ఏర్పాటైంది. తొలి ఛైర్మన్​ కె. అచ్యుతరెడ్డి. ఉపాధ్యాక్షురాలు మసుమా బేగం.
    • → కేంద్ర ప్రభుత్వం 1957 డిసెంబర్ 12 ‘ది పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రిక్వయిర్మెంట్ యాజ్ టు రెసిడిన్స్) యాక్ట్ జారీ చేసింది. ఇది 1959లో అమలులోకి వచ్చింది.
  • → కె.ఆర్. ఆమోస్ ఆధ్వర్యంలో 1968 జూలై-10 తెలంగాణ హామీల దినం నిర్వహించారు.
    • → 1968లో కొలిశెట్టి రామదాసు 20 మంది ‘ఇల్లెందు’. యువకులతో ‘తెలంగాణ ప్రాంతీయ సమితి’ ఏర్పాటు చేశాడు. దీని అధ్యక్షుడు – రామదాసు. ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న.
  • → 1969 ఉద్యమానికి ముందు హైదరాబాద్ వెలుపల ముల్కి సమస్యపై మొట్టమొదట ఉద్యమం మొదలైంది ఇల్లందులోనే.
    • →1969, జనవరి-08న (జనవరి 22వరకు) అన్నాబత్తుల రవీంద్రనాథచే ఆమరణ నిరాహార దీఓను ఖమ్మంలో మొదలుపెట్టించిన వారు కొలిశెట్టి రామదాసు, ఉపాధ్యయుడు రామ సుధాకర్​ రాజు. అప్పటి మున్సిపల్​ ఛైర్మన్​ కవి రాజమూర్తి తొలి రోజు నిరాహార దీక్ష లో పాల్గొన్నారు.
  • →ముఖ్యమంత్రి జలగం వెంగళరావును కుట్రపూరితంగా పంపించి 16వ రోజున రవీంద్రనాథ్ ను నిరాహార దీక్ష విరమింపజేశారు.​
    • →1969 జనవరి 10న పోటు కృష్ణమూర్తి ఆమరణ నిరాహార దీక్ష ‘పాల్వంచ’లో ప్రారంభించారు. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో నాన్ ముల్కీలను తొలగించాలనేది ఈ దీక్ష డిమాండ్​.
  • →1969 జనవరి 19 సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి అఖిల పక్ష సమావేశం. జనవరి 21న జీఓ 36 విడుదల. 1956 నవంబర్ నుండి నియమించబడిన నాన్ ముల్కీలను 1969 ఫిబ్రవరి లో బదిలీ చేయాలని ఈ జీవో సారాంశం.
    • → 1959 మార్చి 21 రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ‘ముల్కి రూల్స్’ 5 ఏళ్ళపాటు అమల్లోకి వచ్చాయి. 1964లో మరో 5 ఏళ్ళు ఉండేలా సవరణ చేశారు. 1969లో మరో అయిదేళ్ళు ‘ సవరించారు.
  • → 1969 జనవరి 20న శంశాబాద్లో ‘ఉమ్లానగర్’ రైల్వే స్టేషన్ వద్ద హైస్కూల్ విద్యార్థులపై కాల్పులు. (1969 ఉద్యమంలో తొలిసారి నగరంలో జరిగిన కాల్పులు ఇవి)
    • → 1969 జనవరి 24న సదాశివపేటలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 1969 జనవరి 25న శంకర్ మరణం. ఫిబ్రవరి 30న కృష్ణ మరణం. 1969 ఉద్యమంలో జరిగిన తొలి కాల్పులు పాల్వంచ, శంషాబాద్లో​ అయితే తొలిసారి కాల్పుల్లో మరణించింది సదాశివపేట కాల్పుల్లోనే.
  • →1970 ఫిబ్రవరి 23న అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్​ పార్క్ లో​ ‘అమరవీరుల స్మారక స్థూపానికి హైదరాబాద్ నగర మేయర్ ఎస్. లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేశాడు.
    • →1970 ఫిబ్రవరి 24న ‘సికింద్రాబాద్ క్లాక్ టవర్ స్థూపానికి’ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ రామచంద్రయ్య శంకుస్థాపన చేశాడు.
  • → పి.డి. యాక్ట్ క్రింద మొట్ట మొదట అరెస్టయిన టీఎన్​జీవో లీడర్​ కె.ఆర్.అమోస్
    • → సికింద్రాబాద్ దుర్గా విలాస్ దగ్గర – తెలంగాణ ఆందోళన కారుడైన ‘ప్రేమ్ కిశోర్ ‘ను ఆంధ్ర గుండాలు హత్య చేశారు.

నవాబ్ అలీ నవాజ్ జంగ్ :

(ప్రముఖ ఇంజనీర్) ప్రభుత్వ స్కాలర్​షిప్​ పై లండన్​ లోని ‘కూపర్స్ హిల్ కాలేజీ’ లొ చదువుకున్నాడు. ఇతని జన్మదినమే జులై 11 ఇంజనీర్స్​ డే గా జరుపుకుంటున్నారు.

ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ – ఇతను డిజైన్ చేసిందే.

1923లో మంజీరా నదిపై నిజాంసాగర్, ఘనపూర్ ఆనకట్ట రూపకల్పన చేసింది ఇతడే. తుంగభద్రా జలాలు వినియోగానికి కృషి చేశాడు.

కృష్ణానదిపై ఏలేశ్వరం వద్ద ప్రాజెక్టును రూపకల్పన చేసింది నవాబ్ అలీజంగ్, కృష్ణానదిపై కమల దిన్నె దగ్గర అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, కృష్ణానదిపై – తంగిడి వద్ద భీమా ప్రాజెక్టు ఇతడు డిజైన్ చేసినవే.

కృష్ణానదిపై ఖమ్మం ‘యూనంబైలు’ గ్రామం దగ్గర కిన్నెరసాని ప్రాజెక్టు నిర్మాణం జరిగింది.

1908లో హైదరాబాద్​లో వరదలు

విశ్వేశ్వరయ్య ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్సాగర్ (గండిపేట) ప్రాజెక్టులు కట్టారు.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య కాలాన్ని ERA OF RESERVOIRS (రిజర్వాయర్ల యుగం అంటారు)

ఇ.డబ్ల్యూ స్లాటర్ కమిటి సూచన మేరకు గోదావరిపై ఇచ్చంపల్లి, పోచంపాడు ప్రాజెక్టులకు నిజాం ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

DONT MISS REVISION NOTES :

తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్​ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్​ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్​ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్​ నోట్స్ 4 తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్​ నోట్స్ 5
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్​లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్​ గవర్నర్​ జనరల్స్​
భక్తి… సూఫీ ఉద్యమాలు

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!