Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్ అఫైర్స్:​ సెప్టెంబర్​ 2024

కరెంట్ అఫైర్స్:​ సెప్టెంబర్​ 2024

బెస్ట్​ కంట్రీస్​ ర్యాంకింగ్​
ప్రపంచవ్యాప్తంగా ది బెస్ట్‌ కంట్రీగా స్విట్జర్లాండ్‌ మరోసారి ఘనతను సొంతం చేసుకుంది. 89 దేశాల్లో యూఎస్‌ న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్ విడుదల చేసిన బెస్ట్‌ కంట్రీస్‌ ర్యాంకింగ్స్‌ 2024లో వరుసగా మూడోసారి టాప్‌ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. భారత్​ గతేడాదితో పోల్చితే మూడు స్థానాలకు దిగి 33వ స్థానంలో ఉంది.

ప్రపంచంలో తొలి న్యూక్లియర్​ క్లాక్​
ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్​ క్లాక్​ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్​ కొలరాడో బౌల్డర్, నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ స్టాండర్డ్స్​ అండ్​ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పరమాణువు కేంద్రకం నుంచి వచ్చే సిగ్నల్స్​ ద్వారా ఈ గడియారం పనిచేస్తుంది.

ప్లాస్టిక్​ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్​ టాప్​
ప్లాస్టిక్‌ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలోనే ప్రథమస్థానంలో ఉందని బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ లీడ్స్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో ఏటా 10.2 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. తర్వాతి స్థానాల్లో నైజీరియా, ఇండోనేసియా, చైనా ఉన్నాయి.

యుఎస్‌ ఓపెన్‌ చాంపియన్స్​
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా ఇటలీ టెన్నిస్‌ స్టార్ జానిక్ సిన్నర్ నిలిచాడు. ఫైనల్లో సినెర్‌ 6–3, 6–4, 7–5తో ప్రపంచ 12వ ర్యాంకర్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)పై గెలుపొందాడు. మహిళల ఫైనల్లో బెలారస్‌ అమ్మాయి సబలెంకా 7-–5, 7–-5తో ఆరోసీడ్‌ జెస్సికా పెగులా(అమెరికా)ను ఓడించి టైటిల్​ నెగ్గింది.

ముగిసిన పారాలింపిక్స్‌-
పన్నెండు రోజులు జరిగిన పారాలింపిక్స్‌ పారిస్‌లో ముగిశాయి. టోక్యో క్రీడల మాదిరే చైనా (220) పతకాలతో టాప్​లో నిలిచింది. బ్రిటన్‌ 124 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. అమెరికా (36 స్వర్ణాలు సహా 105) మూడో స్థానం సాధించింది. భారత్‌ 29 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది.

ఆపరేషన్‌ సద్భావ్‌తో ఆపన్నహస్తం
భారీ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన మయన్మార్, లావోస్, వియత్నాం దేశాలను ఆదుకునేందుకు భారత్​ ‘ఆపరేషన్‌ సద్భావ్‌’ పేరుతో ఆ దేశాలకు తక్షణావసర సామగ్రిని పంపించింది. తైపూన్‌ యాగి కారణంగా అతి భారీ వర్షాలతో మయన్మార్, లావోస్, వియత్నాంలు వరదనీట మునిగాయి.

అమెరికాలో క్వాడ్‌ సమ్మిట్​
అమెరికాలో డెలావెర్‌లోని విల్మింగ్టన్‌లో క్వాడ్‌ దేశాల అధినేతల శిఖరాగ్ర సమావేశం జ‌రిగింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆతిథ్యమిచ్చిన ఈ సదస్సులో భార‌త్ ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా, జపాన్‌ ప్రధానులు ఆంథోనీ అల్బనీస్, ఫుమియో కిషిదా పాల్గొన్నారు. స్వేచ్ఛాయుత, సమగ్ర, శాంతి సౌభాగ్యాలతో కూడిన ఇండో–పసిఫిక్‌కు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

శ్రీలంక అధ్యక్షుడిగా దిసనాయకే
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా మార్క్సిస్ట్‌ నేత అనూర కుమార దిసనాయకే ప్రమాణస్వీకారం చేశారు. శ్రీలంకకు అనూర కుమార దిసనాయకే తొమ్మిదో అధ్యక్షుడు కాగా.. తొలి వామపక్ష అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు. ఈ ఫలితాల్లో అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే తొలి రౌండ్‌లోనే వైదొలిగారు.

శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య
శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు ముగియడంతో సెప్టెంబ‌ర్ 23వ తేదీ ప్రధాని దినేశ్‌ గుణవర్థనే పదవికి రాజీనామా చేశారు. నూతన అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకే హరిణితో ప్రధానిగా ప్రమాణం చేయించారు.

నాలుగు సంస్థలకు నవరత్న హోదా
ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థలైన నేషనల్‌ హైడ్రాలిక్‌ పవర్‌ కార్పొరేషన్‌, సట్లెజ్‌ జల విద్యుత్‌ నిగమ్, సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కొత్తగా నవరత్న హోదా లభించింది. దీంతో భారతదేశంలో నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల మొత్తం సంఖ్య 25కి చేరుకుంది.

తోడేళ్ల కోసం ఆపరేషన్‌ భేడీయా
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహరాయిచ్‌లోని మహసి ప్రాంతంలో తోడేళ్ల దాడిలో ఏడుగురు చనిపోవడంతో పాటు 30 మందికిపైగా గాయపడ్డారు. దీంతో అటవీశాఖ అధికారులు ‘ఆపరేషన్‌ భేడీయా’ చేపట్టి నాలుగింటిని పట్టుకున్నారు. మిగతా రెండింటి కోసం గాలిస్తున్నారు. తోడేళ్లు కనిపిస్తే కాల్చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశాలు జారీ చేశారు.

అతి పెద్ద తేలియాడే సోలార్‌ ప్రాజెక్టు
నీటిలో తేలియాడే అతి పెద్ద సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టులో ఉత్పత్తి కార్యకలాపాలను మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్‌లో ప్రారంభించారు. రూ.646 కోట్లతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు 90 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మహిళల భద్రతకు షీ–బాక్స్‌ పోర్టల్‌
పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం షీ–బాక్స్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ పోర్టల్‌ ఉపయోగపడడంతో పాటు దర్యాప్తు ఏ విధంగా జరుగుతున్నదో తెలుసుకోవచ్చు.

‘అపరాజిత’ బిల్లుకు ఆమోదం
మహిళలపై అత్యాచారం, హత్య వంటి తీవ్ర నేరాలకు పాల్పడే దోషులకు మరణ శిక్ష విధించడానికి ఉద్దేశించిన ‘అపరాజిత’ బిల్లుకు పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ‘అత్యాచారం కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైన 21 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలి.

వృద్ధి అంచనాలను పెంచిన వరల్డ్​ బ్యాంక్​
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్‌ పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 6.6 శాతం ఉంటుందన్న తొలి (జూన్‌ నివేదికలో) అంచనాలను తాజాగా 7 శాతానికి పెంచింది. వ్యవసాయ రంగంలో రికవరీ, గ్రామీణ డిమాండ్‌ పుంజుకోవడం తమ అంచనాల పెంపునకు కారణంగా తాజా ‘ఇండియన్‌ డెవలప్‌మెంట్‌ అప్‌డేట్‌’ నివేదికలో పేర్కొంది.

లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 23వ లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటును ఆమోదించారు. ఇది సెప్టెంబర్ 1, 2024 నుంచి ఆగస్టు 31, 2027 వరకు పనిచేస్తుంది. కమీషన్‌లో పూర్తికాల చైర్‌పర్సన్, నలుగురు సభ్యులు, అదనపు ఎక్స్-అఫీషియో, ఐదుగురు పార్ట్ టైమ్ సభ్యులు ఉంటారు.

భార‌త భూభాగాల‌తో నేపాల్ కరెన్సీ
భార‌త భూభాగాలైన కాలాపానీ, లిపులేఖ్‌, వింపియాధురా త‌మ‌వేన‌ని 2020లోనే కొత్త పొలిటిక‌ల్ మ్యాప్‌ను రూపొందించడంతో పార్లమెంటు ఆమోద‌ముద్ర వేసింది. తాజాగా కొత్త క‌రెన్సీ నోట్లపై కూడా కొత్త మ్యాప్‌ను ముద్రించ‌డానికి నేపాల్ సిద్ధమ‌వుతోంది.

బ్రూనై పర్యటనలో ప్రధాని మోదీ
ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం బ్రూనైకు భారత ప్రధాని మోదీ వెళ్లడం ఇదే తొలిసారి. వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను బ్రూనైతో మరింత బలోపేతం చేసుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ‘యాక్ట్‌ఈస్ట్‌ విధానంలో భారత్‌కు బ్రూనై ముఖ్యమైన భాగస్వామి.

రామన్​ మెగసెసె అవార్డులు
2024 సంవత్సరానికి ప్రముఖ జపాన్​ యానిమేటర్​ హయావో వియాజాకీని రామన్​ మెగసెసె అవార్డు దక్కింది. ఆయనతో పాటు వియత్నాం డాక్టర్​ న్గుయోన్​, మాజీ బౌద్ధ సన్యాసి కర్మఫుంట్​షొ, ఇండోనేషియాకు చెందిన ఫర్విజీ ఫర్హాన్​, థాయ్​లాండ్​కు చెందిన డాక్టర్​ మూమెంట్​ సంస్థకు ఈ పురస్కారం లభించింది.

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌-
సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌ (సైమా) – 2024 వేడుక దుబాయ్‌ వేదికగా జరిగింది. 2023 సంవత్సరంలో సత్తా చాటిన సినీమాలు, నటీనటులు, చిత్ర బృందాలకు పురస్కారాలు అందించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్‌ కేసరి’ నిలిచింది. ఉత్తమ నటుడిగా నాని (దసరా) , నటిగా కీర్తి సురేశ్(దసరా), దర్శకుడిగా శ్రీకాంత్‌ ఓదెల (దసరా), సహాయ నటుడిగా దీక్షిత్‌ శెట్టి పురస్కారాలు దక్కించుకున్నారు.

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024
జైపూర్‌లో అంతర్జాతీయ స్వచ్ఛ వాయు దివాస్ సందర్భంగా స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌-2024 ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ 25వ స్థానంలో నిలిచింది. సూరత్‌(గుజరాత్‌) టాప్​లో ఉంది. 3 లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో.. రాయ్‌బరేలి(ఉత్తర్‌ప్రదేశ్‌), నల్గొండ( తెలంగాణ) తొలి రెండు స్థానాల్లో ఉండగా, సంగారెడ్డి 8వ స్థానంలో ఉంది.

హైదరాబాద్​లో ఏఐ గ్లోబల్​ సమ్మిట్​
అంతర్జాతీయ ఏఐ గ్లోబల్ సమ్మిట్‌ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. గ్లోబల్ సమ్మిట్ లో ఏఐ రోడ్ మ్యాప్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ప్రపంచం నలుమూలల నుండి 2,000 మంది వ్యక్తులు ఇందులో పాల్గొన్నారు. కొత్తగా నిర్మించనున్న ఫోర్త్​ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీ ఏర్పాటు చేయనున్నారు.

యుద్ధ్ అభ్యాస్ స్టార్ట్​
భారతదేశం-–అమెరికా సంయుక్త సైనిక వ్యాయామం 20వ ఎడిషన్, యుద్ధ్ అభ్యాస్ 2024, రాజస్థాన్‌లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లోని ఫారిన్ ట్రైనింగ్ నోడ్‌లో ప్రారంభమైంది. సెప్టెంబరు 22 వరకు జరుగుతుంది.

వరుణ ద్వైపాక్షిక విన్యాసాలు
22వ ఇండో ఫ్రెంచ్​వరుణ ద్వైపాక్షిక నావికా విన్యాసాలు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్​ 1 వరకు ఫ్రాన్స్‎లోని టౌలాన్​లో జరిగాయి. మధ్యదరా సముద్రంలో జరిగిన నావికా విన్యాసాల్లో భారత నావికాదళానికి చెందిన ఫ్రంట్​లైన్​ యుద్ధ నౌక ఐఎన్​ఎస్​ తబర్ పాల్గొన్నది.

రెండో అతిపెద్ద 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌
కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం అమెరికాను వెనక్కి నెట్టి భారత్​ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా అవతరించింది. చైనా 32% వాటాతో టాప్​లో ఉండగా, భారత్​ భారత్ 13% వాటాతో రెండో స్థానం,10% మార్కెట్ వాటాతో అమెరికా మూడవ స్థానంలో ఉంది. యాపిల్, శాంసంగ్ కంపెనీలు 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

ఉత్తమ పర్యాటక గ్రామం దేవ్‌మాలీ
రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌ సమీప బ్యావర్‌ జిల్లాకు చెందిన దేవ్‌మాలీ భారత్‌లో ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. దేవ్‌మాలీ ప్రత్యేకత ఏమిటంటే.. గ్రామానికి చెందిన 3,000 బీఘాల (1,875 ఎకరాల) భూమిని స్థానికంగా కొండపై వెలసిన దేవనారాయణ్‌ స్వామికి అంకితం చేశారు.

ఆస్కార్‌కు ‘లాపతా లేడీస్’
అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్‌’ సినిమా 97వ ఆస్కార్ పోటీలకు అధికారికంగా ఎంపికైంది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారత్​ నుంచి అధికారిక ఎంట్రీగా ప్రకటించింది. 2025 మార్చి 2వ తేదీ ఆస్కార్ అవార్డుల‌ వేడుక అమెరికాలోని లాస్ ఎంజ‌ల్స్‌లో జ‌రుగ‌నుంది.

క్యూఎస్‌ టాప్​ 100 ర్యాంకింగ్స్‌
ఎంబీఏ కోర్సుల నిర్వహణ ప్రమాణాల్లో ప్రపంచస్థాయి అగ్రశ్రేణి 100 విద్యాసంస్థల్లో భారత్‌కు చెందిన మూడు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లకు, హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)కు స్థానం లభించింది. లండన్‌కు చెందిన ప్రముఖ ఉన్నతవిద్యా విశ్లేషణ సంస్థ ‘క్యూఎస్‌’ విడుదల చేసిన ర్యాంకుల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

పోర్టుబ్లెయిర్‌ ఇకపై శ్రీ విజయపురం

అండమాన్, నికోబార్‌ దీవుల రాజధాని పోర్టుబ్లెయిర్‌ పేరు మారుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై దీనిని శ్రీ విజయపురంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు.

జాతీయ ఉత్తమ అధ్యాపకురాలు
జాతీయ ఉత్తమ అధ్యాపకురాలిగా బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగానికి అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా.నందవరం మృదుల ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డు దక్కించుకున్న ఏకైక అధ్యాపకురాలుగా నిలిచింది.

నలిమెల భాస్కర్​కు కాళోజీ అవార్డ్​
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త నలిమెల భాస్కర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం-2024కు ఎంపిక చేసింది. రూ.1,01,116 నగదుతో పాటు పురస్కారం ప్రదానం చేయనుంది.

పీఏసీ చైర్మన్​గా గాంధీ
శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టిమేట్స్ కమిటీకి చైర్మన్గా నల్లమద ఉత్తమ్ పద్మావతి, ప్రజా పద్దుల సంఘం చైర్మన్గా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యను నియమిస్తూ లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహచార్యులు బులిటెన్ విడుదల చేశారు.

మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు
తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి భవిష్యత్‌ తరాలకు గుర్తుండేలా కోఠిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి ఆమె పేరు పెడుతున్నామని సీఎం ఆమె వర్ధంతి సభలో వెల్లడించారు.

తెలంగాణలో కంటెయినర్‌ పాఠశాల
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బంగారుపల్లి గొత్తికోయగుంపు అటవీ ప్రాంతంలో రాష్ట్రంలోనే తొలి కంటెయినర్​ పాఠశాల ఏర్పాటు చేశారు. ఇక్కడ శాశ్వత నిర్మాణాలకు అటవీశాఖ అనుమతి లేకపోవడంతో ఈ ఏర్పాటు చేశారు.

వరి దిగుబడిలో తెలంగాణ టాప్​
వరి దిగుబడిలో తెలంగాణ 2023-–24లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. పత్తిలో 3, పొద్దుతిరుగుడులో 4, మొక్కజొన్న, చిరుధాన్యాల్లో 5వ స్థానంలో నిలిచింది. దేశంలో ప్రధాన పంటల దిగుబడుల తుది అంచనాలను కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసింది.

ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా (ఎస్‌ఈసీ) రిటైర్డ్​ ఐఏఎస్‌ అధికారిణి ఐ.రాణీ కుముదిని నియమితులయ్యారు.ఆమె ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు.

దీప్తి జివాంజి
పారాలింపిక్స్‌లో మహిళల అథ్లెటిక్స్‌ 400 మీటర్ల టీ20 రేసులో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి దీప్తి జివాంజి కాంస్య పతకం సాధించింది. ఎనిమిది మంది పోటీపడ్డ ఫైనల్లో 20 ఏళ్ల దీప్తి 55.82 సెకన్లలో గమ్యం చేరుకొని మూడో స్థానంలో నిలిచింది.

గౌతమ్‌ అదానీ
పారిశ్రామిక దిగ్గజం గౌతమ్‌ అదానీ (రూ.11.6 లక్షల కోట్లు )భారత్​లో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచారు. మరోసారి రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ (రూ.10.14 లక్షల కోట్లు )ని అధిగమించి అగ్రస్థానం దక్కించుకున్నారు. హురున్ ఆగ‌స్టు 29వ తేదీ విడుదల చేసిన సంపన్నుల జాబితా–2024లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

చేతన్ సీ చందేగేవ్
ఇండియన్ నేవీలో సబ్‌మెరైన్‌ల 18వ ఫ్లాగ్ ఆఫీసర్‌గా రియర్ అడ్మిరల్ చేతన్ సీ చందేగేవ్ బాధ్యతలు స్వీకరించారు.ఇండియ‌న్ నేవీలోని అన్ని త‌ర‌గ‌తుల స‌బ్ మెరైన్‌ల‌కు క్లాస్ అథారిటీ, సేఫ్టీ క్లాస్ అథారిటీ క‌లిగిన స‌బ్‌మెరైన్స్‌కు ఈయ‌న‌ బాధ్యత‌లు స్వీక‌రించారు. ఆయ‌న గ‌త ఫ్లాగ్ ఆఫీస‌ర్ రియ‌ర్ అడ్మిర‌ల్ కె.వెంక‌ట్రామ‌న్ నుంచి బాధ్యత‌లు స్వీక‌రించిన‌ట్లు నేవీ వ‌ర్గాలు తెలిపాయి.

టీవీ సోమనాథన్
సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్ కేబినెట్ కొత్త సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్ల నుంచి కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా ప‌నిచేస్తున్న రాజీవ్ గౌబ స్థానంలో ఈయ‌న‌ బాధ్యతలు స్వీక‌రించి, రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.

సతీష్ కుమార్
ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (ఐఆర్‌ఎంఎస్‌) అధికారి సతీష్ కుమార్ రైల్వే బోర్డు చైర్మన్‌-సీఈఓగా నియమితుల‌య్యారు.ఈ పదవిని చేపట్టనున్న తొలి ఎస్సీ అధికారి ఈయనే. సతీష్ కుమార్ ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ 1986 బ్యాచ్‌కు చెందినవారు. ఆయనకు రైల్వే రంగంలో 34 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.

దళవాయి శివమ్మ
భారత ప్రభుత్వం అందించే ‘శిల్పగురు’ అవార్డు శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన తెలుగు కళాకారిణి దళవాయి శివమ్మను వరించింది. కేంద్ర జౌళి శాఖ నిర్వహించే శిల్పగురు, జాతీయ చేతి వృత్తుల అవార్డు-2023 పోటీలకు తోలుపై అద్భుతంగా రూపొందించిన శ్రీకృష్ణ చరిత, ఏడు అడుగుల ఎత్తైన విశ్వరూప హనుమాన్‌ కళాఖండాలను ఆమె పంపించారు.

అమిత్ షా
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా అధికార భాషా పార్లమెంటరీ కమిటీ చైర్‌ప‌ర్సన్‌గా ఎన్నికయ్యారు. 2019లో తొలిసారిగా కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన అమిత్ షా 2024 వరకు పనిచేశారు. 1976లో అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ ఏర్పడింది. ఇందులో లోక్‌స‌భ, రాజ్యసభకు చెందిన 30 మంది సభ్యులతో ఉంటుంది.

అతిశీ
ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా ఆమ్‌ఆద్మీ పార్టీ నేత, మంత్రి ఆతిశీ ఎన్నికయ్యారు. కొత్త సీఎంగా ఆతిశీ పేరును ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతిపాదించగా, ఆప్‌ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రస్తుతం ఆతిశీ ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూ సహా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

కింజరాపు రామ్మోహన్‌ నాయుడు
ఢిల్లీలో జరిగిన రెండవ ఆసియా–పసిఫిక్‌ మంత్రుల స్థాయి సదస్సులో ఆసియా పసిఫిక్‌ సభ్య దేశాల చైర్మన్‌గా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామ్మోహన్‌ నాయుడు పేరును సింగపూర్‌ ప్రతిపాదించగా భూటాన్‌ బలపరిచింది. మిగతా సభ్యదేశాలన్నీ ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

క్రిస్టియానో రొనాల్డో
ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో తన సోషల్‌ మీడియా ఖాతాలన్నింటిలో కలిపి ఫాలోవర్ల సంఖ్య 100 కోట్లను దాటింది. దీంతో సోష‌ల్‌మీడియాలో ఈ అరుదైన‌ ఘ‌న‌త సాధించిన తొలి వ్యక్తిగా రొనాల్డో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. ప్రస్తుతం అతడి యూట్యూబ్‌ ఖాతాకు 6 కోట్లు, ఇన్‌స్టాలో 63.9 కోట్లు, ‘ఎక్స్‌’లో 11.3 కోట్లు, ఫేస్‌బుక్‌లో 17 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఎస్‌.ద్వారకనాథ్‌
సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా హైదరాబాద్‌ శ్రీనగర్‌కాలనీ నివాసి, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.ద్వారకనాథ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నియామకపు ఉత్తర్వులను విడుదల చేసింది. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన తన న్యాయవిద్యను ఎల్లారెడ్డిగూడలోని పీఆర్‌ఆర్‌ న్యాయ కళాశాలలో పూర్తిచేశారు. ఆయన తండ్రి జస్టిస్‌ దశరథరామిరెడ్డి ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.

రణ్‌ధీర్‌సింగ్‌
ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ (ఓసీఏ) అధ్యక్షుడిగా రణ్‌ధీర్‌సింగ్‌ ఎంపికయ్యాడు. 44వ ఓసీఏ జనరల్‌ అసెంబ్లీలో 77 ఏళ్ల రణ్‌ధీర్‌ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయుడు రణ్‌ధీరే. అయిదు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న మాజీ షూటర్‌ రణ్‌ధీర్‌ 2028 వరకు పదవిలో ఉంటారు.

ఆర్‌ఎస్‌ శర్మ
పెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్​డీసీ) తాజగా ఆర్‌ఎస్‌ శర్మను తమ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గా నియమించుకుంది. శర్మ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) డైరెక్టర్ జనరల్ & మిషన్ డైరెక్టర్, ట్రాయ్​ చైర్మన్, నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓగా పనిచేశారు.

చిరంజీవి
మెగాస్టార్‌ చిరంజీవి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. చిరంజీవి 156 సినిమాల్లో 537 పాటల్లో 24 వేల స్టెప్పులతో రికార్డ్‌ నెలకొల్పారు. దేశవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా చిరు మాత్రమే ఉన్నారు. అందుకే ఆయనకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది.

రియా సింఘా
ఈ ఏడాది మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటాన్ని రియా సింఘా సొంతం చేసుకున్నారు. జైపుర్‌ వేదికగా జరిగిన ‘మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024’ పోటీల్లో రియా గెలుపొందారు. గ్లోబల్ మిస్‌ యూనివర్స్‌ 2024లో భారత్‌కు రియా ప్రాతినిధ్యం వహించనుంది.

అమర్‌ప్రీత్‌ సింగ్‌
ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ (ఐఏఎఫ్‌) కొత్త చీఫ్​గా ఎయిర్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌ నియమితులయ్యారు. ప్రస్తుత ఎయిర్​ చీఫ్ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌధరీ పదవీకాలం సెప్టెంబరు 30న ముగియనుంది.

లోగనాథన్‌ ధనుష్‌
తమిళనాడుకు చెందిన యువ వెయిట్‌లిఫ్టర్‌ లోగనాథన్‌ ధనుష్‌ పురుషుల 55 కేజీల విభాగంలో ఐడబ్ల్యూఎఫ్‌ జూనియర్‌ ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యంతో సత్తా చాటాడు. ఈ పోటీల్లో పతకం గెలిచిన భారత తొలి పురుష వెయిట్‌లిఫ్టర్‌గా రికార్డు నమోదు చేశాడు.

పి.సుశీల
ప్రముఖ నేపథ్య గాయని పి.సుశీలకు తమిళనాడు ప్రభుత్వం దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పేరిట ఇస్తున్న ‘కలైజ్ఞర్‌ నినైవు కలైతురై విత్తగర్‌’ పురస్కారం ప్రకటించింది.

జావెలిన్​ త్రోలో పసిడి త్రో
సోనెపట్‌కు చెందిన సుమిత్‌ అంటిల్​ 2024 పారిస్​ పారాలింపిక్స్‌లో జావెలిన్‌త్రో ఎఫ్‌-64 విభాగంలో 70.59 మీటర్ల త్రోతో పసిడి పట్టేశాడు. ఆర్చరీలో హర్విందర్​, షూటింగ్​లో అవనీ లేఖరా, క్లబ్​ త్రోలో ధరంబీర్​ సింగ్​ ఇప్పటికే గోల్డ్​ మెడల్స్​ సాధించారు.

పారాలింపిక్స్​లో రికార్డ్​ పతకాలు
పారిస్‌లో పారా అథ్లెట్లు అయిదు రోజుల వ్యవధిలోనే అయిదు స్వర్ణాలు సహా 24 పతకాలు సాధించి అబ్బురపరిచారు.టోక్యోలో 19 పతకాలతో నెలకొల్పిన రికార్డును తిరగరాశారు. ప్రస్తుతం భారత్‌ 5 స్వర్ణాలు, 9 రజతాలు, 10 కాంస్యాలు కలిపి మొత్తంగా 24 పతకాలతో పట్టికలో 13వ స్థానంలో ఉంది.

యుఎస్‌ ఓపెన్‌ చాంపియన్స్​
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా ఇటలీ టెన్నిస్‌ స్టార్ జానిక్ సిన్నర్ నిలిచాడు. ఫైనల్లో సినెర్‌ 6–3, 6–4, 7–5తో ప్రపంచ 12వ ర్యాంకర్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)పై గెలుపొందాడు. మహిళల ఫైనల్లో బెలారస్‌ అమ్మాయి సబలెంకా 7-–5, 7–-5తో ఆరోసీడ్‌ జెస్సికా పెగులా(అమెరికా)ను ఓడించి టైటిల్​ నెగ్గింది.

ముగిసిన పారాలింపిక్స్‌-
పన్నెండు రోజులు జరిగిన పారాలింపిక్స్‌ పారిస్‌లో ముగిశాయి. టోక్యో క్రీడల మాదిరే చైనా (220) పతకాలతో టాప్​లో నిలిచింది. బ్రిటన్‌ 124 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. అమెరికా (36 స్వర్ణాలు సహా 105) మూడో స్థానం సాధించింది. భారత్‌ 29 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది.

ఐదోసారి ఆసియా చాంపియన్స్‌
పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో విజేతగా నిలిచింది.ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమిండియా 1–0తో చైనా జట్టుపై గెలిచి టోర్నీ చరిత్రలో ఐదోసారి చాంపియన్‌షిప్‌ను సాధించింది. ఇప్పటి వరకు 8 ఏసీటీ ఈవెంట్లు జరిగితే ఐదుసార్లు భారత్‌ 2011, 2016, 2018, 2023లలో విజేతగా నిలిచింది.

నీరజ్‌ చోప్రాకు రెండో స్థానం
భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 87.86 మీటర్ల దూరం ఈటెను విసిరి, సెంటీమీటర్‌ తేడాతో అగ్రస్థానం కోల్పోయాడు. గ్రెనడాకు చెందిన పీటర్స్‌ అండర్సన్‌ 87.87 మీటర్లతో చాంపియన్‌గా నిలిచాడు.

చెస్‌ ఒలింపియాడ్‌లో స్వర్ణాలు
45వ చెస్‌ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల చెస్‌ జట్లు దేశానికి రెండు స్వర్ణాలు అందించాయి. వ్యక్తిగత విభాగాల్లో గుకేశ్‌ (బోర్డు–1; 9 పాయింట్లు), అర్జున్‌ (బోర్డు–2; 10 పాయింట్లు), దివ్య దేశ్‌ముఖ్‌ (బోర్డు–3; 9.5 పాయింట్లు), వంతిక అగర్వాల్‌ (బోర్డు–4; 7.5 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచి గోల్డ్​ మెడల్స్​ సొంతం చేసుకున్నారు.

ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్‌ది మంత్‌
‘ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్‌ది మంత్‌’ ఆగస్టు నెల అవార్డును పురుషుల, మహిళల విభాగాల్లో రెండు అవార్డులు శ్రీలంకకే దక్కాయి. మెన్స్ కేటగిరీలో స్పిన్ సంచలనం దునీత్ వెల్లలాగే, మహిళల క్రికెట్‌ విభాగంలో లంక స్టార్ బ్యాటర్ హర్షిత సమరవిక్రమ ఈ అవార్డు దక్కించుకున్నారు.

తరంగ్​ శక్తి విన్యాసాలు
భారత్​ అతిపెద్ద బహుపాక్షిక వైమానిక షో రెండో దశ (తరంగ్​ శక్తి–2) రాజస్థాన్​లోని జోధ్​పూర్​లో ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్​ 14 వరకు జరగుతున్నాయి.

ఫేషియల్​ పేమెంట్​ సిస్టం ‘స్మైల్​ పే’
భారత్​లో తొలిసారి ఫేషియల్​ పేమెంట్​ సిస్టం స్మైల్​ పే ను ఫెడరల్​ బ్యాంక్​ ఆవిష్కరించింది. రిలయన్స్​ రిటైల్​, అనన్య బిర్లాకు చెందిన ఇండిపెండెంట్​ మైక్రో ఫైనాన్స్​ ద్వారా ఇది ప్రారంభమైంది.

అగ్ని-–4 బాలిస్టిక్ మిస్సైల్ సక్సెస్​
అగ్ని-–4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ పరీక్షను ఒడిశాలోని చండీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి డీఆర్​డీవో విజయవంతంగా ప్రయోగించింది. 4వేల కిలోమీటర్ల దూరంలోని శత్రులక్ష్యాలను ఛేదించగల కెపాసిటీ అగ్ని-4 మిస్సైల్ సొంతం.

అంతరిక్షంలో ప్రైవేట్​ స్పేస్‌వాక్‌
అంతరిక్షంలో ప్రైవేటు స్పేస్‌వాక్‌ నిర్వహించిన తొలివ్యక్తిగా బిలియనీర్‌ జేర్డ్‌ ఐజక్‌మన్‌ చరిత్ర సృష్టించి, క్షేమంగా భూమికి చేరుకున్నారు. పొలారిస్‌ డాన్‌ ప్రాజెక్టు కింద ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా నలుగురు వ్యక్తులను స్పేస్‌ఎక్స్‌ నింగిలోకి పంపింది.

నేవీలో చేరిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌
అరేబియా సముద్రంలో స్వదేశీ సముద్ర శక్తిని మరింత బలోపేతం చేసేందుకు దేశీయంగా తయారైన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ పశ్చిమ నౌకాదళంలో చేరింది. సముద్రం, ఆకాశం, భూమిపై ఒకేసారి కార్యకలాపాలు నిర్వహించి, దేశ భద్రతను ఇది కాపాడుతుంది.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!