Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSUCIL Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. యురేనియం కార్పొరేషన్ లో రూ.56 వేల వేతనంతో జాబ్స్..

UCIL Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. యురేనియం కార్పొరేషన్ లో రూ.56 వేల వేతనంతో జాబ్స్..

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు (Job Notification) విడుదల చేస్తున్నాయి. తాజాగా భారత ప్రభుత్వ అటామిక్‌ ఎనర్జీ మంత్రిత్వశాఖకు చెందిన జార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (UICL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 239 ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

విద్యార్హతల వివరాలు:
ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, టర్నర్‌/మెషినిస్ట్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, మెకానికల్‌ డీజిల్, కార్పెంటర్‌, ప్లంబర్‌ తదితర ట్రేడుల్లో ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. టెన్త్ లో 50 శాతం మార్కులతో పాసై.. సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా అందుకు సమానమైన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
Read This: బ్యాంక్ ఆఫీసర్​​ జాబ్​లకు ఐబీపీఎస్​ నోటిఫికేషన్​: 710 పోస్టులు

ఇంకా వయో పరిమితి విషయానికి వస్తే.. అభ్యర్ధుల వయస్సు నవంబర్‌ 30 నాటికి 18-25 ఏళ్లు ఉండాలి. వివిధ వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. విద్యార్హతలు, మెరిట్‌ తుది ఎంపిక ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.56,100 వేతనంతో పాటు ఇతర అలవెన్సులు చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు.
పూర్తి వివరాలకు సందర్శించాల్సిన వెబ్ సైట్: https://www.apprenticeshipindia.gov.in/

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!