ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల్లో ఉద్యోగాలు (Jobs) సాధించడమే లక్ష్యంగా లక్షలాది మంది నిరుద్యోగులు ప్రిపరేషన్ సాగిస్తూ ఉంటారు. ఆయా రంగాల్లో ఉద్యోగ భద్రతతో పాటు మంచి వేతనాలు ఉండడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కలిగిన వివిధ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ల (Latest Job Notifications) వివరాలు ఇలా ఉన్నాయి.
APPSC Group-1 Jobs: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల గ్రూప్-I ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 92 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 13న ప్రారంభం కాగా.. దరఖాస్తుకు రేపు అంటే.. నవంబర్ 2 లాస్ట్ డేట్. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్: https://psc.ap.gov.in/
SBI Jobs: తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఉద్యోగ నోటిఫికేషన్. మొత్తం 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో 1400 రెగ్యులర్ ఉద్యోగాలు కాగా.. మరో 22 బ్యాక్ లాగ్ లాగ్ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు sbi.co.in లేదా ibpsonline.ibps.in వెబ్ సైట్లలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నిన్నటి అక్టోబర్ 18 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 7ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.
Read This: బ్యాంక్ ఆఫీసర్ జాబ్లకు ఐబీపీఎస్ నోటిఫికేషన్: 710 పోస్టులు
BOB Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా ఐటీ ప్రొఫెషనల్స్ విభాగంలో ఖాళీల భర్తీకి నియామకాలను చేపట్టింది బ్యాంక్. మొత్తం 60 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 9ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్: https://www.bankofbaroda.in/
Read This: AP Jobs: ఏపీలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 15 కంపెనీల్లో 1000 జాబ్స్.. వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..
NTPC Jobs: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (EET) పోస్టుల (Jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తులకు నవంబర్ 11ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్: https://careers.ntpc.co.in/
IB Jobs: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. సెక్యూరిటీ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 1671 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 25 ఆఖరి తేదీ. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ mha.gov.inలో సమర్పించాల్సి ఉంటుంది.