కేంద్ర సర్కార్ ఈమధ్యే ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంలో భాగంగా భారత నౌకాదళంలో అగ్నివీర్ ఖాళీల నియామకానికి ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అగ్నివీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అగ్నివీరులుగా సెలక్ట్ అయిన అభ్యర్థులు ఐఎన్ఎస్ చిల్కాలో ప్రారంభం కానున్న 02,2024 బ్యాచ్ పేరుతో ట్రైనింగ్ ఉంటుంది. మే 13 నుంచి దరఖాస్తుల ప్రక్రియ షురూ కానుంది. ఇంటర్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళ అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు
అర్హత:
అగ్నివీర్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్ రెండేళ్ల ఒకేషనల్ కోర్సు లేదా ఇంజనీరింగ్ డిప్లొమా ( మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు:
అభ్యర్థి 01-11-2023 నుంచి 30-04-2007 మధ్యలో జన్మించి ఉండాలి. అవివాహిత పురుష, మహిళ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
ఎత్తు:
పురుషులు, మహిళలు కనీసం 157సెం.మీ ఎత్తు ఉండాలి.