HomeLATESTటెట్​ ప్రిపరేషన్​ ప్లాన్​​ 2022

టెట్​ ప్రిపరేషన్​ ప్లాన్​​ 2022

సర్కారు కొలువుల్లో టీచర్​ పోస్టుకు ఉన్న క్రేజే వేరు. చాలా మందికి గవర్నమెంట్​ టీచర్​ ఉద్యోగం సాధించాలనే కోరిక ఉంటుంది. మంచి వేతనంతో పాటు సమాజంలో గౌరవం, భావి భారత పౌరులను తయారు చేసే గొప్ప అవకాశం. ఈ ఆలోచనతోనే తెలంగాణాలో రాష్ట్రాల్లో బీఈడీ, డీఈడీ చేసి టీచర్​ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు లక్షల్లో ఉన్నారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి 2017లో మొదటి సారి టీచర్​ పోస్టుల భర్తీ చేశారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత సుమారు 20 నుంచి 25వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్​ వేసేందుకు ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది.

Advertisement

టీచర్​ రిక్రూట్​మెంట్​ టెస్ట్​ రాసే ముందు జాతీయ ఉపాధ్యాయ మండలి (ఎన్​సీటీఈ) నిబంధనల మేరకు టీచర్​ ఎలిజిబులిటీ టెస్ట్​(టెట్​) లో అర్హత సాధించాల్సిందే.. తెలుగు రాష్ట్రాల్లో టెట్​ –అర్హత పరీక్షగానే కాకుండా డీఎస్సీలోనూ 20 శాతం మార్కుల వెయిటేజీ ఉండడంతో టెట్​లో సాధించే స్కోర్ ఉద్యోగం సాధించడంలో చాలా కీలకం. టెట్​ సిలబస్‌లో పొందుపరిచిన అంశాలపై పట్టు, ప్రాక్టీస్​, ప్రామాణికమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్​, పక్కా ప్రిపరేషన్​ ఉంటే టెట్‌లో టాప్​ స్కోర్​ సాధించవచ్చు.

టెట్​ పరీక్ష పేపర్​–1, పేపర్​–2 రెండు రకాలుగా ఉంటుంది. దీనిని 150 మార్కులకు నిర్వహిస్తారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు(ఎస్‌జీటీ) టెట్​ పేపర్‌–1ఏ; ఆరో తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించేవారు (స్కూల్‌ అసిస్టెంట్‌) పేపర్‌–2ఏ రాయాల్సి ఉంటుంది.

టెట్​ పేపర్​ –1లో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజీ నుంచి 30 ప్రశ్నలు, లాంగ్వేజ్‌–1 తెలుగు నుంచి 30 ప్రశ్నలు, లాంగ్వేజ్‌–2 ఇంగ్లీష్​ నుంచి 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్‌ నుంచి 30 ప్రశ్నలు, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. లాంగ్వేజ్​–1 సంబంధించి అభ్యర్థి 10వ తరగతి వరకు చదివిన ప్రాథమిక భాషను అంటే తెలుగు, ఉర్దూ సహా మొత్తం ఎనిమిది లాంగ్వేజ్‌ల్లో ఏదైనా సెలెక్ట్​ చేసుకోవచ్చు.

Advertisement

ప్రిపరేషన్​ ప్లాన్​

టెట్‌ పేపర్‌–2 నాలుగు సెక్షన్లుగా 150 మార్కులకు మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటుంది. ఇందులో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజీ నుంచి 30 ప్రశ్నలు, లాంగ్వేజ్‌–1 నుంచి 30 ప్రశ్నలు, లాంగ్వేజ్‌ 2 నుంచి 30 ప్రశ్నలు, స్కూల్​ అసిస్టెంట్​ మ్యాథమెటిక్స్‌ అండ్‌ సైన్స్‌ బోధించే వారి కోసం మ్యాథ్స్, సైన్స్‌ నుంచి 60 ప్రశ్నలు, సోషల్‌ స్టడీస్‌ బోధించే వారు, లాంగ్వేజ్​ పండిట్స్​ కు సోషల్‌ స్టడీస్‌ నుంచి 60 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి అభ్యర్థికి చైల్డ్​ డెవలప్​మెంట్​ అండ్​ పెడగాగి(సైకాలజీ), లాంగ్వేజ్​1, లాంగ్వేజ్​2 కామన్​గా ఉంటుంది.

సైకాలజీలో ఇంపార్టెంట్​ టాపిక్​లివే..

సైకాలజీ(చైల్డ్​ డెవలప్​మెంట్​ అండ్​ పెడగాగి) పార్ట్​ 30 మార్కులకు ఉంటుంది. బీఈడీ, డీఈడీలో సైకాలజీ సబ్జెక్టును చదివి విద్యార్థులు చదివి ఉంటారు. టెట్​ సిలబస్​లో సైకాలజీని మూడు టాపిక్​లుగా విభజించారు. ఇందులో శిశు వికాసం, అభ్యసనం, పెడగాగి ఉన్నాయి. ముఖ్యంగా శిశు వికాసంలో వికాసం, పెరుగుదల, పరిపక్వత భావన–స్వభావం, వికాస నియమాలు, వికాసంపై ప్రభావం చూపే కారకాలు, వికాస దశలు తదితర అంశాలపై అభ్యర్థులు దృష్టి సారించాలి. ప్రశ్న ఏ విధంగా వచ్చినా.. సరైన సమాధానం గుర్తించేలా కాన్సెప్టులపై పట్టుసాధించాలి. పాత ప్రశ్నపత్రాల ఆధారంగా.. ప్రశ్నల క్లిష్టతపై అవగాహన ఏర్పరచుకోవచ్చు. ప్రిపరేషన్‌కు బీఈడీ, డీఈడీ తెలుగు అకాడమీ పుస్తకాలను చదివితే మంచి స్కోర్​ సాధించవచ్చు.

Advertisement

కంటెంట్​తో ఇలా చదవండి​

టెట్​లో టాప్​ స్కోర్​ సాధించడానికి కంటెంట్​ చాలా ఉపయోగపడుతుంది.

తెలుగు(ఆప్షనల్‌), ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సైన్స్‌, సోషల్‌స్టడీస్‌ సబ్జెక్టుల కంటెంట్‌ ప్రిపరేషన్‌కు ఎనిమిదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను బాగా అధ్యయనం చేస్తే ఒక్క మార్కు కూడా కోల్పోకుండా ఉంటాము. తెలుగులో కవులు–కావ్యాలు, అర్థాలు, పర్యాయపదాలు, జాతీయాలు తదితరాలతోపాటు భాషాంశాలను చదవాలి.

ఇంగ్లిష్‌లో పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్, టెన్సెస్, టైప్స్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్‌ తదితరాలపై పట్టు సాధించాలి.

గణితంలో అర్థమెటిక్, సంఖ్యా వ్యవస్థ, క్షేత్ర గణితం, రేఖా గణితం, బీజ గణితం, సాంఖ్యక శాస్త్రం తదితర చాప్టర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రాక్టీస్‌ ద్వారా మాత్రమే మ్యాథ్స్‌లో పూర్తి మార్కులు లభిస్తాయి.

సైన్స్ లో జీవ ప్రపంచం, మొక్కలు, జంతువులు, ఆహారం, సైన్స్‌లో విభాగాలు, పోషణ, ఆహార పిరమిడ్, మానవ శరీరం, పదార్థాలు, కొలతలు, ప్రమాణాలు, ఆమ్లాలు–క్షారాలు, శక్తి రూపాలు, పునరుత్పాదక ఇంధన వనరులు తదితర అంశాలపై దృష్టిపెట్టాలి.

ధ్వని, విద్యుత్, కాంతి, ఉష్ణం చాప్టర్లలోని ముఖ్య భావనలు, శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలపై పట్టుసాధించాలి. అదే విధంగా పర్యావరణానికి సంబంధించి జీవవైవిధ్యం, ఆవరణ వ్యవస్థలు, పర్యావరణ సమస్యలు, భూతాపం తదితర అంశాలు ముఖ్యమైనవి. వీటికి సంబంధించి సమకాలీన సదస్సులు, ప్రభుత్వ విధానాలపై దృష్టిసారించాలి.

సోషల్‌లో స్థానిక భౌగోళిక అంశాలు, పారిశ్రామిక విప్లవం, మనీ–బ్యాంకింగ్, ప్రభుత్వం; రాజకీయ వ్యవస్థలు, జాతీయ ఉద్యమం, భారత రాజ్యాంగం, పరిపాలన, సాంఘిక సంస్థలు, అసమానతలు, మతం–సమాజం, సంస్కృతి, కమ్యూనికేషన్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. భౌగోళిక, చారిత్రక, ఆర్థిక, పౌరశాస్త్ర అంశాలను అనుసంధానించుకుంటూ.. అధ్యయనం చేయడం ద్వారా సబ్జెక్టుపై పట్టుసాధించొచ్చు.

మెథడాలజీ వెరీ ఈజీ

Advertisement

ఇక మెథడాలజీకి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్​, సైన్స్​, సోషల్​, మ్యాథ్స్​ నుంచి ఒక్కోదానిలో 6 ప్రశ్నలు వస్తాయి. లాంగ్వేజ్​ మినహా ఆప్షనల్​ సబ్జెక్టుల్లో దాదాపుగా సిలబస్​ కామన్​గా ఉంటుంది. బోధనా లక్ష్యాలు, బోధనా ప్రణాళిక, బోధనోపకరణాలు, మూల్యాంకనం తదితర అంశాల నుంచి ప్రశ్నలొస్తాయి. కంటెంట్‌లోని అంశాలకు అన్వయించుకుంటూ చదవితే సులభంగా అర్ధమవుతుంది. సొంత నోట్స్​ రాసుకుంటూ మోడల్​ పేపర్స్​ ప్రాక్టీస్​ చేస్తే మెథడాలజీలో మంచి స్కోర్​ సాధించవచ్చు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!