HomeLATESTహైదరాబాద్​ ఇండియన్​ బిజినెస్​ స్కూల్​లో రూ.2360కే సర్టిఫికెట్​ కోర్సు

హైదరాబాద్​ ఇండియన్​ బిజినెస్​ స్కూల్​లో రూ.2360కే సర్టిఫికెట్​ కోర్సు

ఉద్యోగార్థులకు అదనపు నైపుణ్యాలతో పాటు ఉద్యోగం చేస్తున్న వారికి కెరీర్​లో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే వినూత్నమైన కోర్సులను అందించేందుకు ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్​ ఆహ్వానం పలుకుతోంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా మండలితో ఎంఓయూ కుదుర్చుకుంది. అతి తక్కువ ఫీజుతో పాలిటెక్నిక్​, డిగ్రీ, ఇంజినీరింగ్​ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ కోర్సులను పరిచయం చేయనున్నారు. ఐఎస్​బీలో సర్టిఫికేట్​ కోర్సులకు చాలా ఫీజు ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వీటిని కేవలం రూ.2,360కే అందిస్తున్నారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్​ సర్టిఫికేట్​ అందించనుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపుతో పాటుగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి కూడా ఆమోదం తెలిపింది. ఆన్​లైన్​ ద్వారా అందించే ఒక్కో కోర్సును 40 గంటల పాటు నిర్వహిస్తారు.

Advertisement

కోర్సుల వివరాలు

బిజినెస్​ లిటరసీ కోర్సు
ఈ కోర్సులో అకౌంటింగ్​ ఫండమెంటల్స్​, స్టాటిస్టిక్స్​ అండ్​ డేటా ఎనలిటిక్స్​, క్రిటికల్​ థింకింగ్​, మార్కెటింగ్​ మేనేజ్​మెంట్​, నెగోషియేషన్​, ఎనాలసిస్​, ప్రాజెక్ట్​ మేనేజ్​మెంట్​ తదితర అంశాలపై బోధన అందిస్తారు.

బిహేవియరల్​ స్కిల్స్​
ఈ కోర్సులో కమ్యూనికేషన్​ స్కిల్స్​, పర్సనాలిటీ డెవలప్​మెంట్​ అండ్​ మైండ్​సెట్​, ఆర్ట్​ ఆఫ్​ నెట్​వర్కింగ్​ టెక్నాలజీ ఫండమెంటల్స్​, ఆర్ట్​ ఆఫ్​ స్టోరీ టెల్లింగ్​ తదితర అంశాలను బోధిస్తారు. 40 గంటల ఈ ప్రోగ్రామ్​ను కనీసం 3 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

డిజిటల్​ లిటరరీ కోర్సు
ఈ కోర్సులో ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​, బ్లాక్​చైన్​ టెక్నాలజీ, డిజిటల్​ మార్కెంటింగ్​, డేటా సైన్స్​ వంటి డిజిటల్​ టెక్నాలజీపై ట్రైనింగ్​ ఇస్తారు.

Advertisement

ఎంటర్​ప్రెన్యూరియల్​ లిటరసీ
ఇందులో స్టార్టప్​ డెవలప్​మెంట్​, డిజిటల్​ ఎడ్యుకేషన్​, ఎంటర్​ప్రెన్యూర్​షిప్​, మార్కెటింగ్​, ఫైనాన్స్​ తదితర బిజినెస్​ సంబంధిత అంశాలను బోధిస్తారు.

రాష్ట్ర సాంకేతిక విద్యామండలి ఆధ్వర్యంలో దరఖాస్తుల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. మార్చి నెలాఖరు నుంచి దరఖాస్తుల స్వీకరిస్తారు. ఏప్రిల్​ 15 నుంచి మొదటి ఏవేని రెండు కోర్సులను, మే 15 నుంచి మిగిలిన రెండు కోర్సులను ప్రారంభిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​ ద్వారా అప్లై చేసుకోవాలి.

వెబ్​సైట్​ : https://www.isb.edu

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!