ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు వేగవంతం కావడంతో విద్యాశాఖ రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించే టీచర్లు (ఎస్జీటీ) టెట్ పేపర్–1, ఎనిమిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు బోధించే టీచర్లు(స్కూల్ అసిస్టెంట్) టెట్ పేపర్–2 ఎలిజిబులిటీ సాధించాల్సి ఉంటుంది.
టెట్ పరీక్షా విధానం
టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్‌ను పేపర్–1, పేపర్–2 రెండు రకాలుగా ఉంటుంది. టెట్ పేపర్–1, పేపర్–2ను పరీక్షను మొత్తం 150 మార్కులకు మల్టీపుల్ చాయిస్ విధానంలో నిర్వహిస్తారు. సమయం రెండున్నర గంటల పాటు కేటాయిస్తారు. నెగిటీవ్ మార్కులు ఏవీ ఉండవు.
టెట్ అర్హతలు
టెట్ పేపర్–1 రాసేందుకు ఇంటర్మీడియేట్ లేదా సీనియర్ సెకండరీ 50శాతం మార్కులతో ఉత్తీర్ణత(ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 45శాతం మార్కులు ఉంటే సరిపోతుంది)తో పాటు ఎన్సీటీఈ గుర్తింపు పొందిన కాలేజీల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమింటరీ ఎడ్యుకేషన్(డీ.ఈఎల్.ఈడీ) లేదా నాలుగేళ్ల బ్యాచ్‌లర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(బీ.ఈఎల్.ఈడీ) లేదా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీ.ఈడీ) సర్టిఫికేట్ కలిగి ఉండాలి. పై కోర్సుల్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
టెట్ పేపర్–2 రాసేందుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో జనరల్ అభ్యర్థులు 50శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు కనీసం 45శాతం మార్కులతో ఉత్తీర్ణతతో పాటు ఎన్సీటీఈ గుర్తింపు పొందిన కాలేజీల్లో బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీ.ఈడీ) లేదా బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీ.ఈడీ, బీఈ/బీటెక్ గ్రాడ్యుయేట్స్, లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కలిగిన వారు అర్హులు. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
టెట్ సిలబస్
టెట్ పేపర్–1లో 150 మార్కులకు గాను 150 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ నుంచి 30 ప్రశ్నలు, లాంగ్వేజ్–1 తెలుగు నుంచి 30 ప్రశ్నలు, లాంగ్వేజ్–2 ఇంగ్లీష్ నుంచి 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. లాంగ్వేజ్–1 సంబంధించి అభ్యర్థి 10వ తరగతి వరకు చదివిన ప్రాథమిక భాషను అంటే తెలుగు, ఉర్దూ సహా మొత్తం ఎనిమిది లాంగ్వేజ్‌ల్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు.
టెట్ పేపర్–2 నాలుగు సెక్షన్లుగా 150 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది. ఇందులో చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ నుంచి 30 ప్రశ్నలు, లాంగ్వేజ్–1 నుంచి 30 ప్రశ్నలు, లాంగ్వేజ్ 2 నుంచి 30 ప్రశ్నలు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ బోధించే వారి కోసం మ్యాథ్స్, సైన్స్ నుంచి 60 ప్రశ్నలు, సోషల్ స్టడీస్ బోధించే వారు, లాంగ్వేజ్ పండిట్స్ కు సోషల్ స్టడీస్ నుంచి 60 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి అభ్యర్థికి చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాగి(సైకాలజీ), లాంగ్వేజ్1, లాంగ్వేజ్2 కామన్‌గా ఉంటుంది.
Telangana TET Exam Pattern
Paper 1 Exam Pattern
S No | Subject Names | No of MCQs | Marks | Duration of Exam |
1 | Child Development & Pedagogy | 30 | 30 | 2 Hours 30 Minutes |
2 | Environmental Studies | 30 | 30 | |
3 | Mathematics | 30 | 30 | |
4 | Language I | 30 | 30 | |
5 | Language II | 30 | 30 | |
Total | 150 MCQs | 150 Marks | 150 Minutes |
Paper 2 Exam Pattern
S No | Subject Names | No of MCQs | Marks | Duration of Exam |
1 | Child Development & Pedagogy | 30 | 30 | 2 Hours 30 Minutes |
2 | Language I (Compulsory) | 30 | 30 | |
3 | Language II (Compulsory) | 30 | 30 | |
4 | Mathematics & Science for Mathematics and Science TeachersSocial Studies for Social and Science TeachersFor other Teachers either 1 or 2 | 60 | 60 | |
Total | 150 MCQs | 150 Marks | 150 Minutes |
ఓబీసీ అభ్యర్థులు 150 మార్కులకు గాను 90 మార్కులు(60 శాతం), బీసీలు 75 మార్కులు (50శాతం), ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 60 మార్కులు(40శాతం) సాధిస్తే టెట్ అర్హత సాధిస్తారు. గతంలో ఏడేండ్ల పాటు టెట్‌కు వ్యాలిడిటీ ఉండేది. తాజాగా లైఫ్‌టైమ్ వ్యాలిడిటీ ఇస్తూ కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది.
2009 విద్యాహక్కు చట్ట ప్రకారం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు టీచర్ ఎలిటిజిబులిటీ టెస్ట్ ‘టెట్’ అర్హత తప్పనిసరి. దీనిని కేంద్రం, ఆయా రాష్ట్రాల పరిధిలో ప్రతి 6 నెలలకు ఒకసారి నిర్వహించాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి సారిగా 2011లో టెట్‌ను నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2016 మేలో, 2017 జూన్‌లో రెండుసార్లు నిర్వహించారు. ఆ తర్వాత ఉపాధ్యాయ నియామకాలు లేనందున ‘టెట్’ను నిర్వహించలేదు. ఉద్యోగాల భర్తీపై ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన నేపథ్యంలో రేపో ఎల్లుండో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
Leave