HomeLATESTఈ వారంలోనే నోటిఫికేషన్​.. తెలంగాణ ఎస్​ఐ, కానిస్టేబుల్​ ఎగ్జామ్​ గైడ్​

ఈ వారంలోనే నోటిఫికేషన్​.. తెలంగాణ ఎస్​ఐ, కానిస్టేబుల్​ ఎగ్జామ్​ గైడ్​


ఈ వారంలోనే తెలంగాణ ప్రభుత్వం 18,334 పోలీస్​ కొలువులకు నోటిఫికేషన్​ ఇవ్వనుంది. ఇందులో ఎస్​ఐ తో పాటు కానిస్టేబుల్ జాబ్స్​ ఉన్నాయి. ఇప్పటినుంచే ప్లాన్​ ప్రకారం ప్రిలిమ్స్​, ఈవెంట్స్​, మెయిన్స్​ ఎగ్జామ్​కు ప్రిపరేషన్​ ప్రారంభిస్తే ఈ జాబ్​ కు సెలెక్టవటం ఈజీ. ఆల్ ది బెస్ట్

Advertisement

నోటిఫికేష‌న్ ఎప్పుడు విడుద‌లైనా ప‌రీక్షలో విజ‌యం సాధించేలా ప్రణాళిక ఉండాలి. రాత‌ప‌రీక్ష, ఈవెంట్స్ రెండింటిలోనూ అల‌స‌త్వం వ‌హించ‌కూడదు. ఈవెంట్స్​ తర్వాత మెయిన్స్‌కు సమయం తక్కువగా ఉంటుంది. అందుకే రాత పరీక్షకు నోటిఫికేష‌న్ రాక‌ముందు నుంచే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పటి నుంచే సిల‌బ‌స్ ప్రకారం స‌బ్జెక్టుల వారీగా పూర్తి అవ‌గాహ‌న పెంచుకుంటే మంచిది. ప్రీవియస్​, మోడల్​ పేపర్స్​ ప్రాక్టీస్ చేయ‌డం ద్వారా ప్రశ్నల స‌ర‌ళిపై అవ‌గాహ‌న వ‌స్తుంది. పోస్టులనుబట్టి కనీస వయసు నిర్ణయిస్తారు. బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీవారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ప్రిలిమ్స్​

ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో 100 ప్రశ్నలు జనరల్‌స్టడీస్‌ నుంచీ, 100 ప్రశ్నలు అర్థమెటిక్‌, రీజనింగ్‌ల నుంచీ ఉంటాయి. కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షలో ఇంగ్లిష్‌, అర్థమెటిక్‌, రీజనింగ్‌, జనరల్‌ స్టడీస్‌ అన్నింటి నుంచీ కలిపి 200 ప్రశ్నలు వస్తాయి. ప్రిలిమినరీ పరీక్ష క్వాలిఫయింగ్‌ మాత్రమే. క్వాలిఫై అయినవారికి ఈవెంట్స్ నిర్వహిస్తారు. దీనిలో అర్హులైన అభ్యర్థులకు మార్కులు కేటాయించి, ఫైనల్​ ఎగ్జామ్​ నిర్వహిస్తారు. వీటిలో వచ్చే మార్కుల ఆధారంగా పోస్టులు కేటాయిస్తారు.

ఈవెంట్స్​

Advertisement

ఎస్​ఐ, కానిస్టేబుల్​ అభ్యర్థులకు ఈవెంట్స్​ సేమ్​ ఉంటాయి. ఫిజికల్​ టెస్టులో 100 మీట‌ర్ల ప‌రుగు, లాంగ్‌జంప్‌, హైజంప్‌, షాట్‌పుట్‌, 800 మీట‌ర్ల ప‌రుగు ఉంటాయి. ఈ ఐదింటిలో అభ్యర్థులు నిర్ణీత స‌మ‌యంలో 800 మీట‌ర్ల ప‌రుగుతోపాటు ఏమైనా రెండు నెగ్గాలి. ద‌ర‌ఖాస్తు చేసుకున్న పోస్టులు, పురుషులు, మ‌హిళ‌లు, మాజీ సైనికుల‌కు దేహ‌దార్ఢ్య ‌ప‌రీక్షలు వేరుగా ఉంటాయి. ప్రిలిమ్స్ ప‌రీక్షలో నెగ్గిన వెంట‌నే ఈవెంట్స్​కు ఎక్కువ స‌మ‌యం కేటాయించాలి. రోజూ ఉద‌యం, సాయం‌త్రం ప్రాక్టీస్ చేయాలి. ప‌రీక్షలో కేటాయించే స‌మయం కంటే త‌క్కువ స‌మ‌యంలో వీటిని పూర్తి చేసేలా స‌న్నద్ధం అయితేనే తుది ద‌శ‌లో ల‌క్ష్యాన్ని సులువుగా చేరుకోగ‌ల‌రు. మేల్​ క్యాండిడేట్స్​ ఎత్తు 167.6 సెం.మీ. కంటే తక్కువ ఉండకూడదు. మహిళలు152.5 సె.మీ. ఉండాలి. ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన పురుష అభ్యర్థులు 160 సెం.మీ ఉండాలి. మహిళలు అయితే 150 సెం.మీ. ఉండాలి.

ఈవెంట్​ పురుషులు మహిళలు

100 మీటర్స్​ 15 సెకండ్స్​ 20 సెకండ్స్​

Advertisement

లాంగ్​ జంప్​ 3.80 మీటర్స్ ​ 2.50 మీటర్స్​

షార్ట్​పుట్​ 5.60 మీటర్స్​ 3.75 మీటర్స్​

              (7.26 కేజీ)      (4 కేజీ)

హైజంప్​ 1.20 మీటర్స్​ –

Advertisement

800 మీటర్స్​ 170 సెకండ్స్​ –

మెయిన్స్​

కానిస్టేబుల్‌ మెయిన్స్​లో 200 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. సమయం 3 గంటలు. ప్రిలిమినరీలో వచ్చిన అంశాల నుంచే ఫైనల్‌ రాతపరీక్షలోనూ ప్రశ్నలు వస్తాయి. ప్రిలిమ్స్​, మెయిన్స్​కు ఒకటే సిలబస్​ ఉంటుంది.

సబ్‌ఇన్‌స్పెక్టర్‌ మెయిన్స్​లో నాలుగు పేపర్లుంటాయి. మొదటి రెండు పేపర్లు ఇంగ్లిష్‌, తెలుగు/ఉర్దూ ఉంటాయి. ఇవి కేవలం క్వాలిఫయింగ్‌ పరీక్షలే. ఉద్యోగ నిర్వహణలో తెలుగు రాయడంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. మిగిలిన రెండు పేపర్లు అర్థమెటిక్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌స్టడీస్‌, చివరి రెండు పేపర్లు, ఈవెంట్స్​లో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టులు కేటాయిస్తారు.

Advertisement

ఎస్ఐ ఎగ్జామ్​ ప్యాటర్న్​

ప్రిలిమ్స్​: రాత పరీక్ష : 200 మార్కులకు ఉంటుంది. ఓసీ-40 శాతం, బీసీ 35, ఎస్సీ, ఎస్టీ 30 శాతం మార్కులు సాధిస్తే ఈవెంట్స్​కు అర్హత సాధిస్తారు.

మెయిన్స్ ఎగ్జామ్​

పేపర్ 1ఇంగ్లిష్100 మార్కులు
పేపర్ 2తెలుగు200 మార్కులు
పేపర్ 3అర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్200 మార్కులు
పేపర్ 4జనరల్ స్టడీస్ ( అబ్జెక్టివ్ )200 మార్కులు

Advertisement

కానిస్టేబుల్ ఎగ్జామ్​ ప్యాటర్న్​

1ప్రిలిమినరీ రాత పరీక్ష200 మార్కులు
2మెయిన్స్ రాత పరీక్ష200 మార్కులు

సిలబస్​

ఇంగ్లిష్‌:

వృత్తిరీత్యా పై అధికారులకు సమాచారాన్ని చేరవేసే క్రమంలో మెయిల్స్‌, లెటర్లు (లేదా) వివిధ అప్లికేషన్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థి ఇంగ్లిష్‌ పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నలు వస్తాయి. గ్రామర్‌, సెంటెన్స్‌ అరేంజ్‌మెంట్‌, ఆర్టికల్స్‌, ప్రిపొజిషన్స్‌, హెల్పింగ్‌ వెర్బ్స్‌, ఇంగ్లిష్‌ నుంచి తెలుగుకు; తెలుగు నుంచి ఇంగ్లిష్‌కు మార్చడం, ఒకాబులరీ వంటి వాటిపై ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్‌ వార్తలు విని, వాటిని అర్థం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.

Advertisement

తెలుగు:

ఈ పేపర్​లో తెలుగు భాషకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఎఫ్‌ఐఆర్‌, ఫిర్యాదు రాయడం, పంచనామా, పై అధికారులకు వివిధ కేసులకు సంబంధించిన నివేదికలను అందించడం పోలీసు వృత్తిలో భాగం కాబట్టి తెలుగు భాషపై అభ్యర్థుల కనీస అవగాహన పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. ఆబ్జెక్టివ్‌ విధానంలో సంధులు, సమాసాలు, ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు, ఖాళీలు పూరించడం, తప్పు పదాలను గుర్తించి, సరిచేయడం వంటివి వస్తాయి.

జనరల్‌ స్టడీస్‌:

భారతదేశ చరిత్ర, భౌగోళికాంశాలు, ఆర్థికాంశాలు, రాజకీయాంశాలపై ప్రశ్నలుంటాయి. తెలంగాణ చరిత్ర, భౌగోళికాంశాలు, రాష్ట్ర అవతరణ, తెలంగాణ అమరుల చరిత్ర, సాయుధ కమిటీలు, నిజాం నవాబుల చరిత్ర, ఆర్థికాంశాలు, ప్రభుత్వ పథకాలు, కరెంట్​ అఫైర్స్​ నుంచి ప్రశ్నలు అడుగుతారు. శాస్త్రీయ, సాంకేతిక అంశాలు, కరెంట్‌ అఫైర్స్‌ చూసుకోవాలి. తెలుగు అకాడమీ 8, 9, 10 తరగతుల పాఠ్యపుస్తకాలు చదివి నోట్స్‌ తయారు చేసుకుంటే మంచిది.

అర్థమెటిక్‌:

ఈ విభాగం నుంచి శాతాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, కాలం- పని, కాలం- దూరం, వ్యాపార భాగస్వామ్యం, వైశాల్యాలు, చుట్టుకొలత, ఘనపరిమాణం, క.సా.గు., గ.సా.భా. వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.ఈ అంశాలను గ్రూపులుగా విభజించి సన్నద్ధమైతే సులభంగా నేర్చుకోవచ్చు. డేటా అనాలిసిస్‌, డేటా సఫిషియన్సీ నుంచి 5 ప్రశ్నలు ఒకే పట్టిక లేదా వెన్‌చిత్రాలు, బార్‌చార్ట్‌, గ్రాఫ్‌ల మీద వస్తాయి. ఇచ్చిన, అందుబాటులో ఉన్న సమాచారం నుంచి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. సింప్లిఫికేషన్‌ తక్కువ సమయంలో పూర్తిచేసేలా షార్ట్‌కట్స్‌, మైండ్‌ కాల్‌క్యులేషన్‌ వాడాలి. మేథమేటిక్స్‌ అంశాల్లో మాత్రికలు, త్రికోణమితి, ఎత్తులు- దూరాలు, సర్డ్స్‌, ఇండిసెస్‌, ఆల్జీబ్రా అంశాలను చదవాలి.

Advertisement

రీజనింగ్‌:

పోలీసుశాఖ ఉద్యోగులు విధి నిర్వహణలో కేసులను విచారించే సమయంలో లాజికల్‌గా ఆలోచించాల్సి ఉంటుంది. నంబర్లు, లెటర్ల ఆధారంగా వచ్చే ప్రశ్నలను లాజికల్‌ రీజనింగ్‌గా పరిగణిస్తారు. సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, రక్తసంబంధాలు, దిక్కులు, పజిల్స్‌ వంటి అంశాలను అనలిటికల్‌ రీజనింగ్‌ అంశాలుగా పరిగణిస్తారు. బొమ్మల ఆధారంగా ప్రశ్నలు ఇస్తే నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌. సిరీస్‌ ప్రశ్నల్లో బొమ్మల మధ్య ఉండే సంబంధాన్ని బట్టి అదే తర్కం వాడుతూ సమాధానం గుర్తించాలి. సిలాజిజమ్‌, అసంప్షన్స్‌, ఇన్ఫరెన్సెస్‌, కోర్సెస్‌ ఆఫ్‌ యాక్షన్‌, ఆర్గ్యుమెంట్స్‌, కన్‌క్లూజన్స్‌, కాజ్‌-ఎఫెక్ట్‌, అసర్షన్‌-రీజన్‌, డెసిషన్‌ మేకింగ్‌ వంటివి హైలెవల్‌ రీజనింగ్‌ అంశాల కిందకి వస్తాయి.

మ్యాథ్స్​పై ఫోకస్​ చేయాలి

బేసిక్ మ్యాథ్స్, క్షేత్రగణితం, సంఖ్యా వ్యవస్థ, సగటు, శాతాలు, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం లాంటి అంశాల నుంచి దాదాపు 70 మార్కులు వస్తున్నాయి. మిగిలిన అంశాల నుంచి 30 మార్కులు ఉంటాయి. కేవలం క్షేత్రగణితం నుంచే 12 నుంచి 20 ప్రశ్నలు అడుగుతున్నారు.

Advertisement

ఎస్ఐ/కానిస్టేబుల్ ఉద్యోగ సాధనలో అర్థమెటిక్, రీజనింగ్ పేపర్ ది కీలకపాత్ర. ఈ పేపర్ లో మ్యాథ్స్ విద్యార్థులకే ఎక్కువ మార్కులు వస్తాయనేది మాత్రం అపోహే అంటున్నారు నిపుణులు. గతంలో జరిగిన పోలీస్ పరీక్షలు చూస్తే… 10వ తరగతి స్టాండర్డ్ మాత్రమే వచ్చాయి. అందువల్ల మ్యాథ్స్ బ్యాక్ గ్రౌండ్ లేని వారు ఎట్టి పరిస్థితుల్లో భయపడొద్దు. ఈ ఎగ్జామ్స్ లో అడిగే విషయాలన్నీ పాఠశాల స్థాయిలో చదివే ఉంటాం. అందువల్ల మరోసారి ప్రాక్టీస్ చేయడంతో పాటు షార్ట్​ కట్స్​ నేర్చుకుంటే… ఎక్కువ మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. సంఖ్యా వ్యవస్థ, చక్రవడ్డి, బారువడ్డి, నిష్పత్తి, అనుపాతం, సగటు, శాతాలు, లాభం, నష్టాలు, కాలం-పని, కాలం-దూరం, పని-వేతనాలు, భాగస్వామ్యం, క్షేత్రగణితం, గడియారాలు, క్యాలండర్ లాంటి అంశాలపైనా దృష్టి పెట్టాలి.

నోటిఫికేష‌న్‌కు సంబంధించిన వివ‌రాలు, అప్‌డేట్స్​ కోసం www.tslprb.in వెబ్‌సైట్‌ను చూడాలి.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!