Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSతెలంగాణలో భారీ నోటిఫికేషన్​.. 9231 ఉద్యోగాలు.. వచ్చే వారమే అప్లికేషన్లు

తెలంగాణలో భారీ నోటిఫికేషన్​.. 9231 ఉద్యోగాలు.. వచ్చే వారమే అప్లికేషన్లు

నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​. తెలంగాణలో మరో భారీ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదల అయింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గురుకుల స్కూళ్లు, కాలేజీల్లో ఉద్యోగాల నియామకానికి సంబంధించిన కీలక ప్రకటన విడుదలైంది. రాష్ట్రంలోని గురుకుల విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న 9231 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్​ విడుదలైంది. తెలంగాణ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూట్స్​ సొసైటీ (TREIRB) ఈ రిక్రూట్​మెంట్​ నోటిఫికేషన్​ విడుదల చేసింది.

Advertisement

రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ పరిధిలో మొత్తం 9,231 పోస్టుల భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. జూనియర్​ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, టీచర్, లైబ్రేరియన్ తదితర పోస్టులు ఈ నోటిఫికేషన్​ ద్వారా భర్తీ చేయనున్నారు.అర్హతలు, నోటిఫికేషన్​కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచనున్నట్లు రిక్రూట్​మెంట్​ బోర్డు ప్రకటించింది. వన్​టైమ్​ రిజిస్ట్రేషన్​ (OTR) ప్రక్రియ ఏప్రిల్​ 12వ తేదీన ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్​ చేసుకోవాల్సిన వెబ్​సైట్​ https://treirb.telangana.gov.in/

పోస్టులు.. ఖాళీల వివరాలు

POSTSVACANCIES
లెక్చరర్​/ఫిజికల్​ డైరెక్టర్​/లైబ్రేరియన్​ 868
జూనియర్​ లెక్చరర్​/ ఫిజికల్​ డైరెక్టర్​/
జూనియర్​ కాలేజీల్లో లైబ్రేరియన్
2008
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్​ (PGT) 1276
లైబ్రేరియన్​ ఇన్​ స్కూల్స్​ 434
ఫిజికల్​ డైరెక్టర్​ ఇన్​ స్కూల్స్​275
డ్రాయింగ్​ టీచర్స్​/ఆర్ట్ టీచర్స్​ 134
క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్స్​/ క్రాఫ్ట్ టీచర్స్​ 92
మ్యూజిక్​ టీచర్స్​ 124
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్​ టీచర్స్​ (TGT) 4020
మొత్తం9231

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!