HomeLATESTప్రపంచ సంపన్నుల జాబితాలో బెర్నార్డ్ ఆర్నాల్డ్ టాప్​.. ముఖేష్​ అంబానీ నెంబర్​ 9 ​

ప్రపంచ సంపన్నుల జాబితాలో బెర్నార్డ్ ఆర్నాల్డ్ టాప్​.. ముఖేష్​ అంబానీ నెంబర్​ 9 ​

ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 169 మంది భారతీయ బిలియనీర్లు ఉన్నారు. ఫోర్బ్స్ (FORBES) విడుదల చేసిన 2023 సంవత్సరపు జాబితాలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ Bernard Arnault & family ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడు. ఫ్రాన్స్​కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ లగ్జరీ గూడ్స్ దిగ్గజం (LVMH) అధిపతి. మొదటిసారి ఫ్రాన్స్ పౌరుడు ప్రపంచ బిలియనర్ల ర్యాంకింగ్‌లో అగ్రగామిగా నిలిచాడు.

Advertisement

భారతీయ బిలియనీర్లలో ముకేశ్ అంబానీ Mukesh Ambani $83.4 బిలియన్ల నికర విలువతో అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. అతని తర్వాత గౌతమ్ అదానీ ($47.2 బిలియన్), శివ్ నాడార్ ($25.6 బిలియన్), సైరస్ పూనావల్లా ($22.6 బిలియన్), లక్ష్మీ మిట్టల్ ($17.7 బిలియన్) మరియు సావిత్రి జిందాల్ & కుటుంబం ($17.5 బిలియన్) ఈ బిలియనీర్ల జాబితాలో ఉన్నారు.

ఎలాన్​ మస్క్​ ర్యాంక్​ పడిపోయింది

పెరుగుతున్న వడ్డీ రేట్లు, స్టాక్​ మార్కెట్​ ఒడిదొడుకుల సంపన్నులను ప్రభావితం చేసినట్లు ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో ఉన్న బిలియనీర్ల విలువ గత ఏడాదితో పోలిస్తే $500 బిలియన్లు తగ్గింది. గత ఏడాది మార్చి 2022లో $12.7 ట్రిలియన్లున్న వీరి సంపద ఇప్పుడు $12.2 ట్రిలియన్లకు తగ్గింది. ఎలాన్ మస్క్ Elon Musk నెంబర్​ వన్​ ర్యాంక్​ నుంచి రెండో స్థానానికి పడిపోయాడు.

ప్రపంచంలో అత్యధికంగా 735 మంది బిలియనీర్లు యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నారు. 562 మంది బిలియనీర్లతో చైనా (హాంకాంగ్ మరియు మకావుతో సహా) రెండవ స్థానంలో ఉంది, 169 బిలియనీర్లతో 675 బిలియన్ డాలర్లతో భారతదేశం తర్వాతి స్థానంలో ఉంది. ప్రపంచంలోని మొత్తం 2,640 మంది బిలియనీర్ల ర్యాంకింగ్​ జాబితాను ఫోర్బ్స్​ ప్రకటించింది.

Advertisement

TOP TEN: Forbes’ annual world’s billionaires list 2023

1. Bernard Arnault & family $211 B
2. Elon Musk $180 B
3. Jeff Bezos $114 B
4. Larry Ellison $107 B
5. Warren Buffett $106 B
6. Bill Gates $104 B
7. Michael Bloomberg $94.5 B
8. Carlos Slim Helu & family $93 B
9. Mukesh Ambani $83.4 B
10. Steve Ballmer $80.7 B
source: forbes website

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!