HomeFeaturedBANK EXAMSఎస్‌బీఐలో 5008 జూనియర్‌ అసోసియేట్‌ జాబ్స్​

ఎస్‌బీఐలో 5008 జూనియర్‌ అసోసియేట్‌ జాబ్స్​

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 5008 జూనియర్‌ అసోసియేట్స్‌ పోస్టులకు నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో 225 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: మొత్తం 5008 జూనియర్‌ అసోసియేట్స్‌(కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్‌/ చివరి సెమిస్టర్‌ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ(జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.


సెలెక్షన్​: ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), స్థానిక భాష పరీక్ష ద్వారా సెలెక్షన్​ ప్రాసెస్​ ఉంటుంది. 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఎగ్జామ్ జరుగుతుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు.. 30 మార్కులకు, న్యూమరికల్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు… 35 మార్కులకు, రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు… 35 మార్కులకు జరుగుతుంది. నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రధాన పరీక్షకు ఎంపికవుతారు.


మెయిన్స్​: మెయిన్‌ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నల సంఖ్య 190. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్‌/ ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు… 50 మార్కులు, జనరల్‌ ఇంగ్లిష్‌ 40 ప్రశ్నలు… 40 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు… 50 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు… 60 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటల 40 నిమిషాలు.


దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్​ 7 నుంచి సెప్టెంబర్​ 27 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు అప్లికేషన్​ ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి. ప్రిలిమ్స్​ నవంబర్‌ 2022లో జరుగుతుంది. మెయిన్స్​ డిసెంబర్‌ 2022/ జనవరి 2023లో జరుగుతుంది. పూర్తి వివరాలకు www.sbi.co.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!