బ్రెజిల్ అధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు బోల్సొనారోను 20 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. జనవరి 1న ఆరోసారి డ సిల్వా బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో డ సిల్వా దేశాధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలతో లు శిక్ష అనుభవించారు.
అత్యంత సురక్షిత దేశం సింగపూర్
ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశంగా సింగపూర్ నిలిచింది. ఈ మేరకు ప్రస్తుత ఏడాదికి గ్లోబల్ అనలిటిక్స్ సంస్థ ‘గాలప్’ విడుదల చేసిన లా అండ్ ఆర్డర్ ఇండెక్స్ స్పష్టం చేసింది. తజకిస్థాన్, నార్వే తరువాత స్థానాలు దక్కించుకున్నాయి. 120 దేశాల్లో నిర్వహించిన సర్వేలో భారత్ 60వ ర్యాంకులో నిలిచింది.
డెన్మార్క్ ప్రధాని రాజీనామా
ఎన్నికల ఫలితాల్లో ముందున్నా డెన్మార్క్ ప్రధానమంత్రి మెటే ఫ్రెడరిక్సన్ రాజీనామా చేశారు. 179 స్థానాలున్న పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీ 90 స్థానాలు సాధించినా, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి రాజీనామా చేశారు.
కొరియాల క్షిపణి పరీక్షలు
దక్షిణకొరియా, అమెరికా చేపట్టిన భారీ వైమానిక విన్యాసాలపై గుర్రుగా ఉన్న ఉత్తరకొరియా ఒక్క రోజే 23 క్షిపణులను ప్రయోగించింది. ఇందులో ఒక క్షిపణి ఉభయ కొరియాల సరిహద్దులకు సమీపంలోకి దూసుకెళ్లింది. ఈ పరిణామంతో అప్రమత్తమైన దక్షిణ కొరియా రెడ్ అలెర్ట్ ప్రకటించింది.
కాప్ 27 సమ్మిట్
యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ (కాప్27) సమ్మట్ ఈజిప్టులోని షాల్మ్ ఎల్ షేక్లో నవంబర్ 6 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (యూఎన్ఎఫ్సీసీసీ) అమలు పర్యవేక్షించడానికి కాప్ ఏర్పాటు చేశారు.
బ్రెజిల్ అధినేతగా డ సిల్వా
బ్రెజిల్ అధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు బోల్సొనారోను 20 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. జనవరి 1న ఆరోసారి డ సిల్వా బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో డ సిల్వా దేశాధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలతో లు శిక్ష అనుభవించారు.
అత్యంత సురక్షిత దేశం సింగపూర్
ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశంగా సింగపూర్ నిలిచింది. ఈ మేరకు ప్రస్తుత ఏడాదికి గ్లోబల్ అనలిటిక్స్ సంస్థ ‘గాలప్’ విడుదల చేసిన లా అండ్ ఆర్డర్ ఇండెక్స్ స్పష్టం చేసింది. తజకిస్థాన్, నార్వే తరువాత స్థానాలు దక్కించుకున్నాయి. 120 దేశాల్లో నిర్వహించిన సర్వేలో భారత్ 60వ ర్యాంకులో నిలిచింది.
డెన్మార్క్ ప్రధాని రాజీనామా
ఎన్నికల ఫలితాల్లో ముందున్నా డెన్మార్క్ ప్రధానమంత్రి మెటే ఫ్రెడరిక్సన్ రాజీనామా చేశారు. 179 స్థానాలున్న పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీ 90 స్థానాలు సాధించినా, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి రాజీనామా చేశారు.
Advertisement
కొరియాల క్షిపణి పరీక్షలు
దక్షిణకొరియా, అమెరికా చేపట్టిన భారీ వైమానిక విన్యాసాలపై గుర్రుగా ఉన్న ఉత్తరకొరియా ఒక్క రోజే 23 క్షిపణులను ప్రయోగించింది. ఇందులో ఒక క్షిపణి ఉభయ కొరియాల సరిహద్దులకు సమీపంలోకి దూసుకెళ్లింది. ఈ పరిణామంతో అప్రమత్తమైన దక్షిణ కొరియా రెడ్ అలెర్ట్ ప్రకటించింది.
కాప్ 27 సమ్మిట్
యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ (కాప్27) సమ్మట్ ఈజిప్టులోని షాల్మ్ ఎల్ షేక్లో నవంబర్ 6 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (యూఎన్ఎఫ్సీసీసీ) అమలు పర్యవేక్షించడానికి కాప్ ఏర్పాటు చేశారు.
ప్రపంచ జనాభా@ 800 కోట్లు
ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరిందని ఐక్యరాజ్యసమితికి చెందిన జనాభా నిధి (యూఎన్‌ఎఫ్‌పీఏ)పేర్కొంది. వచ్చే ఏడాది భారత్, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం కాబోతోంది. దేశ సగటు వయసు 28.7 ఏళ్లు. చైనా (38.4), జపాన్ (48.6), అంతర్జాతీయ సగటు (30.3) కన్నా ఇండియా మెరుగ్గా ఉంది.
అమెరికా–జపాన్ సైనిక విన్యాసాలు
దక్షిణ జపాన్‌లో అమెరికా–జపాన్‌లు భారీస్థాయిలో సంయుక్త సైనిక విన్యాసాలకు శ్రీకారం చుట్టాయి. ‘కీన్ స్వోర్డ్’ పేరుతో జరుగుతున్న ఈ విన్యాసాల్లో జపాన్‌కు చెందిన 26 వేల మంది, అమెరికాకు చెందిన 10 వేల మంది సైనికులతో పాటు 30 నౌకలు, 370 విమానాలు పాల్గొననున్నాయి.
భారత్‌కు జీ 20 అధ్యక్ష బాధ్యతలు
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కూటమి జీ 20 అధ్యక్ష బాధ్యతల్ని భారత్ స్వీకరించింది. బాలిలో జరిగిన ముగింపు సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీకి ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో లాంఛనంగా అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించారు. వచ్చే ఏడాది సదస్సు భారత్ ఆధ్వర్యంలో జరగనుంది.
కరెన్సీ పర్యవేక్షణ జాబితా నుంచి భారత్ తొలగింపు
కరెన్సీ పర్యవేక్షణ జాబితా నుంచి భారత్‌ను అమెరికా ఆర్థిక శాఖ తొలగించింది. అమెరికాతో వాణిజ్యం నిర్వహించే ప్రధాన దేశాలు తమ కరెన్సీ మారకపు విలువకు సంబంధించి అనుసరించే పద్ధతులు, స్థూల ఆర్థిక విధానాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాలో పేర్లు చేర్చడం, తొలగింపులు చేస్తుంటారు. గత రెండేళ్లుగా భారత్ ఈ జాబితాలో ఉంది.
ఇండోనేసియాలో భూకంపం
ఇండోనేసియాలోని జావా ద్వీపంలో నవంబర్ 21న భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనల్లో మొత్తం 268 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని పశ్చిమ జావా గవర్నర్ రిద్వాన్ కమిల్ తెలిపారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో పశ్చిమ జావాలోని సియాంజుర్ రీజియన్‌లో సంభవించింది.
16 ఏళ్లకే ఓటు హక్కు
ఓటు హక్కు అర్హతను 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించే ప్రతిపాదనను పార్లమెంట్‌లో ప్రవేశ పెడతామని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ తెలిపారు.16 ఏళ్ల వారికీ ఓటు హక్కు కల్పించిన దేశాల్లో ఆస్ట్రియా, మాల్టా, బ్రెజిల్, క్యూబా, ఈక్వెడార్ ఉన్నాయి.
కాప్–27.. ‘పరిహార నిధి’కి సై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఈజిప్ట్‌లోని షెర్మ్–ఎల్–షేక్ నగరంలో నిర్వహించిన కాప్–27 నవంబర్ 20న ముగిసింది. వాతావరణ మార్పుల వల్ల విధ్వంసానికి గురైన, నష్టపోయిన దేశాలకు పరిహారం చెల్లించేందుకు ఈ సందర్భంగా ఒక నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
జాతీయం
విశాఖలో ‘ఇండో- సింగపూర్’ విన్యాసాలు
విశాఖ తీరం బంగాళాఖాతంలో భారత్ – సింగపూర్ ద్వైపాక్షిక ‘మారిటైం సింబెక్స్ – 2022’ విన్యాసాలను తూర్పు నౌకాదళం నిర్వహించింది. విన్యాసాల్లో రిపబ్లిక్ సింగపూర్ నేవీ నుంచి ఫార్మడిబుల్ శ్రేణికి చెందిన ఆర్‌ఎస్‌ఎస్ స్టల్‌వార్ట్, విక్టరీ శ్రేణికి చెందిన ఆర్‌ఎస్‌ఎస్ విజిలెన్స్ నౌకలు పాల్గొన్నాయి.
ప్రపంచంలో ఎత్తైన శివుడి విగ్రహం
రాజస్థాన్ రాజ్‌సమంద్ జిల్లాలోని నాథ్‌ద్వారాలో ప్రపంచంలో ఎత్తయిన శివుడి విగ్రహాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆవిష్కరించారు. ఈ విగ్రహం ఎత్తుం 369 అడుగులు ఉంది.
పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్‌గా సజ్జాద్
జమ్మూకశ్మీర్‌లోని పీపుల్స్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపక నేత అబ్దుల్ గనీ లోన్ కుమారుడైన సజ్జాద్ గనీ లోన్ ఆ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అధ్యక్ష స్థానం ఎన్నికకు ఈ పార్టీ షెడ్యూలు ప్రకటించగా పోటీ లేకపోవడంతో సజ్జాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
విశాఖలో ‘ఇండో- సింగపూర్’ విన్యాసాలు
విశాఖ తీరం బంగాళాఖాతంలో భారత్ – సింగపూర్ ద్వైపాక్షిక ‘మారిటైం సింబెక్స్ – 2022’ విన్యాసాలను తూర్పు నౌకాదళం నిర్వహించింది. విన్యాసాల్లో రిపబ్లిక్ సింగపూర్ నేవీ నుంచి ఫార్మడిబుల్ శ్రేణికి చెందిన ఆర్‌ఎస్‌ఎస్ స్టల్‌వార్ట్, విక్టరీ శ్రేణికి చెందిన ఆర్‌ఎస్‌ఎస్ విజిలెన్స్ నౌకలు పాల్గొన్నాయి.
ప్రపంచంలో ఎత్తైన శివుడి విగ్రహం
రాజస్థాన్ రాజ్‌సమంద్ జిల్లాలోని నాథ్‌ద్వారాలో ప్రపంచంలో ఎత్తయిన శివుడి విగ్రహాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆవిష్కరించారు. ఈ విగ్రహం ఎత్తుం 369 అడుగులు ఉంది.
పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్‌గా సజ్జాద్
జమ్మూకశ్మీర్‌లోని పీపుల్స్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపక నేత అబ్దుల్ గనీ లోన్ కుమారుడైన సజ్జాద్ గనీ లోన్ ఆ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అధ్యక్ష స్థానం ఎన్నికకు ఈ పార్టీ షెడ్యూలు ప్రకటించగా పోటీ లేకపోవడంతో సజ్జాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఝార్ఖండ్లో రిజర్వేషన్లు 77 శాతం
ఝార్ఖండ్‌లో వివిధ వర్గాల ప్రజలకు రిజర్వేషన్లను ప్రస్తుతమున్న 60 శాతం నుంచి 77 శాతానికి పెంచుతూ రాష్ట్ర శాసనసభ ఓ బిల్లును ఆమోదించింది. రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలు (ఓబీసీ), ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తాజా బిల్లు వల్ల 77 శాతానికి పెరుగుతాయి.
భారత వృద్ధి 7 శాతం
ప్రస్తుత సంవత్సరం (2022)లో భారత వృద్ధి 7 శాతానికి పరిమితం అవుతుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనా వేసింది. ఈ సంస్థ గత మేలో వేసిన అంచనాల్లో వృద్ధి రేటు 8.8 శాతం కాగా, సెప్టెంబరులో 7.7 శాతానికి తగ్గించింది. ఇప్పుడు మరింత సవరించి 7 శాతానికి పరిమితం చేసింది. అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు, ప్రపంచ వృద్ధి నెమ్మదించడంతో భారత ఆర్థిక కార్యకలాపాలు తగ్గుతాయని పేర్కొంది.
ప్రసారభారతి సీఈవోగా గౌరవ్ ద్వివేది
ఛత్తీస్‌గఢ్ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి గౌరవ్ ద్వివేది ప్రసారభారతి సీఈవోగా నియమితులయ్యారు. 1995 బ్యాచ్‌కు చెందిన ఆయన ఈ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగుతారు. శశిశేఖర్ వెంపటి 2017 నుంచి ఈ ఏడాది జూన్ వరకు ప్రసారభారతి సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు.
చిరంజీవికి అరుదైన గౌరవం
గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో సినీ హీరో చిరంజీవికి ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ – 2022 పురస్కారం దక్కింది. గతంలో ఈ అవార్డుని అమితాబ్ బచ్చన్, హేమమాలిని, రజనీకాంత్, ఇళయరాజా అందుకున్నారు.
ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్
కేంద్ర నూతన ఎన్నికల కమిషనర్ (ఈసీ)గా అరుణ్ గోయల్ నవంబర్ 21న బాధ్యతలు స్వీకరించారు. 1985 పంజాబ్ కేడర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన గోయల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న అరుణ్ గోయల్ ఈ నెల 18న స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
పర్యావరణ పరిరక్షణ సూచీ
కాలుష్యం బారి నుంచి భూమిని పరిరక్షించుకునే చర్యల్లో మన దేశం గతంలో కన్నా మెరుగైన పనితీరుతో తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకుంది. పర్యావరణ మార్పు ఆచరణ సూచీ (సీసీపీఐ) – 2023లో 8వ ర్యాంక్ దక్కించుకుంది. గతంలో కంటే రెండు స్థానాలు మెరుగుపరుచుకుంది.
భారత్‌కు ‘ఎక్సెల్ అవార్డ్ – 2022’
కుటుంబ నియంత్రణలో అత్యాధునిక విధానాల వినియోగం, నాయకత్వానికి ఇచ్చే ప్రతిష్టాత్మాక ‘ఎక్సెల్ అవార్డ్ – 2022’ భారత్‌ను వరించింది. అత్యాధునిక, అత్యంత నాణ్యమైన కుటుంబ నియంత్రణ విధానాలను అనుసరిస్తున్న దేశాల విభాగంలో ఒక్క భారత్ మాత్రమే ఈ పురస్కారాన్ని దక్కించుకుంది.
ఏఐసీటీఈ ఛైర్మన్‌గా టీజీ సీతారామ్
ఐఐటీ – గువాహటి డైరెక్టర్ టి.జి.సీతారామ్ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చైర్మన్‌గా నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఏఐసీటీఈ తాత్కాలిక ఇన్‌ఛార్జిగా యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ ఉన్నారు.
పంజాబ్‌లో పాత పింఛను పథకం
పంజాబ్‌లో ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేరుస్తూ సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2004లో నిలిపివేసిన పాత పింఛను పథకాన్ని (ఓపీఎస్) రాష్ట్రంలో మళ్లీ అమలు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో 1.75 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.
ప్రాంతీయం
ఆస్కీతో రెడ్కో అగ్రిమెంట్
ఇంధన సంరక్షణ కార్యక్రమాలపై కలిసి పనిచేసేందుకు ‘అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా’ (ఆస్కీ)తో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో) అవగాహనా ఒప్పందం చేసుకుంది. రాబోయే అయిదేళ్ల పాటు రెండు సంస్థలూ ఇంధన సంరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆస్కీ తెలిపింది.
ఎరువుల కర్మాగారం ప్రారంభం
రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్‌ఎఫ్‌సీఎల్) ప్రారంభించి, జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. డిజిటల్ విధానంలో రిమోట్ ద్వారా కర్మాగారాన్ని ఆయన ప్రారంభించారు. రామగుండం ఎరువుల పరిశ్రమలో ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న కిసాన్ యూరియా ఇకపై ‘భారత్ యూరియా’గా మార్కెట్లోకి రానుంది.
అతిపెద్ద ఐస్‌క్రీమ్ ఇండస్ట్రీ
దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీమ్ కంపెనీ జహీరాబాద్‌లో ప్రారంభమైందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రోజుకు 7 టన్నుల చాక్లెట్లు, 100 టన్నుల ఐస్‌క్రీమ్‌ను ఉత్పత్తి చేసే పరిశ్రమను రూ.600 కోట్లతో హట్సన్ సంస్థ ఏర్పాటు చేసింది.
కొత్త రెవెన్యూ మండలం
తెలంగాణలో మరో కొత్త రెవెన్యూ మండలాన్ని ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ రెవెన్యూ డివిజన్లోని పొతంగల్ను రెవెన్యూ మండలంగా ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో మండలాల సంఖ్య 621 కి చేరింది.
వార్తల్లో వ్యక్తులు
ఇలా భట్
మహిళా హక్కుల ఉద్యమకారిణి, సెల్ఫ్ ఎంప్లాయ్‌డ్ విమెన్స్ అసోసియేషన్ (సేవా) వ్యవస్థాపకురాలు ఇలా భట్ నవంబర్ 2న అహ్మదాబాద్‌లో ఆనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. పద్మభూషణ్ గ్రహీత అయిన ఆమె మహిళా సాధికారికత సాధనకు ఎనలేని కృషి చేసి అంతర్జాతీయ గుర్తింపు పొందారు.
శ్రీరామ్ కృష్ణన్
భారతీయ అమెరికన్ శ్రీరామ్ కృష్ణన్‌ను ట్విటర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌గా నియమిస్తున్నట్లు కంపెనీ నూతన యజమాని ఎలాన్ మస్క్ ప్రకటించారు. చెన్నైకు చెందిన కృష్ణన్ ప్రస్తుతం సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటల్ సంస్థ అయిన యాండ్రీసెన్ హోరోవిట్జ్ (ఎ16జడ్)లో సాధారణ భాగస్వామి. ఆయన అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు.
ఉల్ఫ్ క్రిస్టెర్‌సన్
స్వీడన్ ప్రధానిగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఉల్ఫ్‌క్రిస్టెర్‌సన్‌ను ఆ దేశ పార్లమెంట్ ఎన్నుకుంది. కేవలం మూడు ఓట్ల ఆధిక్యంతో(176–173) ఆయన డెమోక్రాట్లపై విజయం అందుకున్నారు. మూడు పార్టీల సంయుక్త భాగస్వామ్యంతో ప్రధాని పదవికి పోటీపడిన ఆయన సంపూర్ణ మెజారిటీని సాధించలేకపోయారు.
సూర్యకుమార్ యాదవ్
టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 863 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. ఐసీసీ విడుదల చేసిన టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ సూర్యకుమార్ నంబర్‌వన్ ర్యాంక్‌కు ఎగబాకాడు.
పీవీవీఎస్‌ఎస్ రవిప్రసాద్
కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ డీజీగా తెలుగు అధికారి నియమితులయ్యారు. ఈ మేరకు మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్, ప్రత్యేక కార్యదర్శిగా పీవీవీఎస్‌ఎస్ రవిప్రసాద్ ఢిల్లీలో బాధ్యతలు చేపట్టారు. ఈ అత్యున్నత పదవిలో తెలుగు వ్యక్తి నియమితులు కావడం ఇదే తొలిసారి.
అర్వింద్ విర్‌మాని
నీతి ఆయోగ్ పూర్తిస్థాయి సభ్యుడిగా ఫౌండేషన్ ఫర్ ఎకనమిక్ గ్రోత్ అండ్ వెల్ఫేర్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అర్వింద్ విర్‌మాని నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ సంస్థలో సభ్యులుగా వీకే సారస్వత్, ప్రొఫెసర్ రమేష్ చంద్, వీకే పాల్ ఉన్నారు. విర్‌మాని నియామకంతో ఆ సంఖ్య నాలుగుకు చేరింది.
సుద్దాల అశోక్ తేజ
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ కవి డా.సామల సదాశివ పురస్కారాన్ని 2022వ సంవత్సరానికి సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు అందించనున్నట్లు తెలంగాణ కళావేదిక అధ్యక్షుడు అనుముల దయాకర్ పేర్కొన్నారు.
పత్తిపాక మోహన్
జాతిపిత మహాత్మా గాంధీపై రాసిన ‘బాలల తాత బాపూజీ’ గేయ కథకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ పత్తిపాక మోహన్‌కు ఢిల్లీలో అందజేశారు.
శ్రీశ్రీ రవిశంకర్
ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అట్లాంటాలో గాంధీ పీస్ పిలిగ్రిమ్ పురస్కారం అందుకున్నారు. మహాత్మాగాంధీ, డా.మార్టిన్ లూథర్ కింగ్‌లు ప్రబోధించిన శాంతి, అహింసా సిద్ధాంతాల వ్యాప్తికి కృషి చేస్తున్నందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
నీరజ్ చోప్రా
ఒలింపిక్ స్వర్ణ పతాక విజేత నీరజ్ చోప్రాను స్విట్జర్లాండ్ టూరిజం ఫ్రెండ్‌షిప్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ మేరకు నీరజ్ చోప్రా ప్రతిభావంతులైన భారతీయ క్రీడాకారులు, ప్రయాణికులకు స్విట్జర్లాండ్‌లోని సాహసోపేతమైన, స్పూర్తిదాయకమైన, అద్భుతమైన ప్రదేశాలపై ప్రచారం చేయనున్నారు.
నసీమా ఖాతూన్
బిహార్ ముజఫర్‌పుర్‌లోని వేశ్యావాటికలో పుట్టి పెరిగిన నసీమా ఖాతూన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సలహా బృందంలో సభ్యురాలిగా చోటు దక్కించుకున్నారు. ముజఫర్‌పుర్‌లోని చతుర్భుజ్ స్థాన్ అనే రెడ్‌లైట్ ఏరియాకు చెందినది నసీమా.
దలైలామా
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా గాంధీ–మండేలా పురస్కారం అందుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నవంబర్ 19న పురస్కారం ప్రదానం చేశారు. ఆసియా, ఆఫ్రియా దేశాల నేతలకు గాంధీ–మండేలా ఫౌండేషన్ 2019 నుంచి పురస్కారాలు అందిస్తోంది.
అన్వర్ ఇబ్రహీం
మలేసియా సీనియర్ నేత, సంస్కరణలవాదిగా పేరున్న అన్వర్ ఇబ్రహీం ఆ దేశ నూతన ప్రధానమంత్రి అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ 112 సీట్లు కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్వర్ నేతృత్వంలోని అలయెన్స్ ఆఫ్ హోప్ 82 సీట్లు గెలుచుకుంది.
సంధ్యా దేవనాథన్
మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్‌గా సంధ్యా దేవనాథన్‌ను నియమిస్తున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం మెటా వెల్లడించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌ల మాతృ సంస్థ అయిన మెటా నుంచి ఇటీవల అజిత్ మోహన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానంలోకి సంధ్యను ఎంపిక చేశారు.
అసీమ్ మునీర్
పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అసీమ్ మునీర్ నియమితులయ్యారు. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మునీర్‌ని కొత్త చీఫ్‌గా నియమించారని వెల్లడించారు. నవంబర్ 29తో ప్రస్తుత ఆర్మీ చీఫ్ బజ్వా పదవీకాలం ముగుస్తుంది.
డా. పూర్ణిమాదేవి
భారత వన్యప్రాణి జీవశాస్త్రవేత్త డా. పూర్ణిమాదేవి బర్మన్‌ను ఈ ఏడాది ఐరాస చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డుకు ఎంపిక చేశారు. పర్యావరణ వ్యవస్థ క్షీణతను నిరోధించడానికి కృషి చేస్తున్న వారికి ఇది ఐరాస ఇచ్చే అత్యుత్తమ గౌరవ పురస్కారం. అస్సాంకు చెందిన పూర్ణిమాదేవి అవిఫౌనా రీసెర్చ్ అండ్ కన్జర్వేషన్ డివిజన్ సీనియర్ ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తున్నారు.
బహదూర్ దేవ్‌బా
నేపాల్ పార్లమెంట్ దిగువ సభ అయిన ప్రజా ప్రతినిధుల సభకు ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవ్‌బా భారీ మెజారిటీతో గెలిచారు. గడిచిన ఏడు ఎన్నికల్లో దేవ్‌బా వరుసగా విజయాలు సాధించారు. ప్రస్తుతం అయిదోసారి ప్రధానమంత్రి పదవి నిర్వహిస్తున్నారు.
సుధారెడ్డి
మేఘా ఇంజినీరింగ్ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి గ్లోబల్ గిఫ్ట్ ఫౌండేషన్‌లో భాగస్వామురాలైన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. పారిస్‌లో జరిగిన ది గ్లోబల్ గిఫ్ట్ గాలా ఎడిషన్‌లో ఆమె భారత్ తరఫున పాల్గొన్నారు.
స్పోర్ట్స్
ఫిఫా అండర్-17 చాంపియన్
భారత్ వేదికగా జరిగిన ఫిఫా అండర్-17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ స్పెయిన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో స్పెయిన్ 1-–0తో కొలంబియాను ఓడించింది. కొలంబియా ప్లేయర్ గుజ్‌మన్ సెల్ఫ్ గోల్ చేయడంతో స్పెయిన్ ఆధిక్యంలోకి వెళ్లింది.
వెర్‌స్టాపెన్ కొత్త రికార్డు
ఫార్ములా వన్ స్టార్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ రికార్డు విజయంతో అదరగొట్టాడు. ఒక సీజన్‌లో అత్యధిక విజయాలతో సరికొత్త రికార్డు నమోదు చేశాడు. మెక్సికో సిటీ గ్రాండ్‌ప్రిలో టైటిల్ సాధించిన వెర్‌స్టాపెన్ ఈ సీజన్‌లో 14వ విజయంతో సత్తాచాటాడు. 2004లో మైకెల్ షుమాకర్ 13 విజయాలు, 2013లో వెటెల్ ఆ రికార్డు సమం చేయగా వెర్‌స్టాపెన్ ఆ రికార్డును తిరగరాశాడు.
ఫిఫా అండర్-17 చాంపియన్
భారత్ వేదికగా జరిగిన ఫిఫా అండర్-17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ స్పెయిన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో స్పెయిన్ 1-–0తో కొలంబియాను ఓడించింది. కొలంబియా ప్లేయర్ గుజ్‌మన్ సెల్ఫ్ గోల్ చేయడంతో స్పెయిన్ ఆధిక్యంలోకి వెళ్లింది.
ఇంగ్లాండ్‌దే టీ20 ప్రపంచకప్
ఇంగ్లాండ్ టీమ్ రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను చేజిక్కించుకుంది. ఫైనల్లో పాకిస్థాన్పై ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సామ్ కరన్ ‘మ్యాన్ ఆఫ్ మ్యాచ్’తో పాటు ‘మ్యాన్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డును గెలుచుకున్నాడు.
అర్జున, ఖేల్‌రత్న అవార్డులు
తెలంగాణ క్రీడాకారిణులు నిఖత్ జరీన్, ఆకుల శ్రీజకు ప్రతిష్ఠాత్మక అర్జున పురస్కారం దక్కింది. 2022కి గాను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 25 మంది అథ్లెట్లతో ప్రకటించిన అర్జున అవార్డుల జాబితాలో బాక్సర్ నిఖత్, టీటీ క్రీడాకారిణి శ్రీజకు చోటు దక్కింది. మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు టీటీ దిగ్గజం శరత్ కమల్‌ను వరించింది.
ఆరోసారి చాంపియన్
పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ‘ఏటీపీ ఫైనల్స్’లో సెర్బియా స్టార్ జొకోవిచ్ ఆరోసారి విజేతగా నిలిచాడు. ఆరు టైటిల్స్‌తో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. ఇటలీలోని ట్యూరిన్ నగరంలో నవంబర్ 20న జరిగిన ఫైనల్లో జొకోవిచ్ మూడో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే)పై గెలిచాడు.
ఫార్ములావన్ విజేత వెర్‌స్టాపెన్
రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ 2022 ఫార్ములావన్ సీజన్ చివరిదైన 22వ రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. ఓవరాల్ గా ఈ సీజన్‌లో వెర్‌స్టాపెన్ మొత్తం 15 రేసుల్లో విజేతగా నిలిచి, ఒకే ఏడాది అత్యధిక ఎఫ్1 రేసుల్లో గెలిచిన డ్రైవర్‌గా వెర్‌స్టాపెన్ రికార్డు సృష్టించాడు.
సైన్స్ అండ్ టెక్నాలజీ
ఫాల్కన్ హెవీ రాకెట్ ప్రయోగం సక్సెస్
అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ మూడేళ్ల తర్వాత తొలిసారిగా తన భారీ ‘ఫాల్కన్ హెవీ’ రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించింది. ఈ సందర్భంగా పలు సైనిక ఉపగ్రహాలను భూకక్ష్యలోకి పంపింది. ఫాల్కన్ హెవీ రాకెట్‌ను తొలిసారి 2018లో ప్రయోగించారు. ఆ తర్వాత 2019లో రెండుసార్లు నింగిలోకి పయనమైంది.
బాలిస్టిక్ క్షిపణి విజయవంతం
వివిధ రకాల లక్ష్యాలను ఛేదించగల రెండో దశ బాలిస్టిక్ క్షిపణి విధ్వంసక వ్యవస్థ తొలి పరీక్షను భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంలో డీఆర్‌డీవో నేతృత్వంలో ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇస్రో తొలి ప్రైవేట్ రాకెట్
దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-–ఎస్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నవంబర్ 18న రాకెట్ ప్రయోగం జరిగింది. దేశీయంగా ప్రైవేట్ రంగంలో రూపొందిన మొదటి రాకెట్ విక్రమ్-ఎస్. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరో స్పేస్ సంస్థ దీన్ని రూపొందించింది.
‘ఆర్టెమిస్-1’ ప్రయోగం సక్సెస్
నాసా ప్రయోగించిన మూన్ రాకెట్ ‘ఆర్టెమిస్-1’ ప్రయాణం విజయవంతంగా ఆరంభమైంది. ఫ్లొరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి గాల్లోకి ఎగిరింది. చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైనదిగా చెబుతున్న ఈ రాకెట్, వ్యోమగాములు లేని, ఖాళీ ఓరియన్ స్పేస్ క్యాప్సుల్‌తో బయల్దేరింది.
రిహార్సల్ విజయవంతం
షార్‌లో పీఎస్‌ఎల్‌వీ -సి54 ప్రయోగానికి నిర్వహించిన సన్నాహక ప్రయోగంలో రాకెట్‌లోని అన్ని దశలు సక్రమంగా పని చేస్తున్నట్లు గుర్తించారు. ప్రయోగానికి ఇబ్బందుల్లేవని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Sir please your mobile number