టీఎస్ఎస్పీడీసీఎల్ (దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ)లో 1000 జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఎగ్జామ్ ను రద్దు చేశారు. జులై 17న ఈ పరీక్ష జరిగింది. ఈ రాత పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడ్డారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు చెందిన కొందరు ఉద్యోగులు, ఇతరులు డబ్బులు వసూలుచేసి కొంత మంది అభ్యర్థులకు సమాధానాలు చేరవేశారనే ఫిర్యాదులతో పోలీసు కేసు నమోదైంది. మాల్ ప్రాక్టీస్ జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది.
దాదాపు 181 మంది అభ్యర్థులకు ముందుగానే సమాధానాలు చేరవేసినట్టు ఈ విచారణలో తెలిసింది. మరింత మంది అభ్యర్థులకు ఈ వ్యవహారంలో ప్రమేయం లేకపోలేదని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. రాత పరీక్షలో జరిగిన ఈ అక్రమాలపై కొంత మంది అభ్యర్థులు కార్పొరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేసి, ఈ పరీక్షను రద్దు చేయాలని సంస్థ యాజమాన్యాన్ని కోరారు. ఈ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డ వివిధ విద్యుత్ సంస్థల ఉద్యోగులను విధుల నుండి సస్పెండ్ చేశారు.
ఈ నేపథ్యంలో పాత నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేసి వెయ్యి జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ కోసం త్వరలో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి ప్రకటన విడుదల చేశారు.
ReplyForward |