HomeLATESTటీఎస్ సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

టీఎస్ సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్ లైన్లో జులై 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకునేందుకు జులై 26వరకు గడవు ఉంది. ఆగస్టు 20 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. అదే నెల 28,29, 30,31 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. సిబిటి పద్దతిలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. కాగా ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను ఓయూ చూస్తోంది. జనరల్ స్టడీస్ 29 సబ్జెక్టుల్లో సీబీటీ విధానంలో పరీక్ష జరగనుంది.

Advertisement

సబ్జెక్టులు: జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్-1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా , మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్ సబ్జెక్టుల్లో ఈ పరీక్షఉంటుంది

అర్హత:
కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ (ఎంఏ, ఎంస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్ (సీఎస్ఈ, ఐటీ) ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.

Advertisement

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష విధానం: మొత్తం 29 సబ్జెక్టులకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత టెస్టు(సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1(జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్)లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2 (అభ్యర్థి పీజీ సబ్జెక్టు)లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు.

పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, మహబూబ్ నగర్, మెదక్, వైజాగ్, నల్గొండ, రంగారెడ్డి పట్టణాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

Advertisement

ముఖ్యమైన తేదీలు :
టీఎస్‌ సెట్‌ నోటిఫికేషన్ విడుదల : మే 4, 2024
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మే 14, 2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: జులై 2, 2024
ఆలస్యరుసుముతో దరఖాస్తులకు చివరితేది: జులై 26, 2024
హాల్‌టికెట్లు విడుదల తేదీ: ఆగస్టు 20, 2024

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!