తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహిస్తున్న సిరిసిల్లోని టీటీడబ్ల్యూఆర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 2024-25 విద్యా సంవత్సరానికి బీఏ ఆనర్స్ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్ వ్యవధి మూడు సంవత్సరాలు ఉంటుంది. ఇంగ్లీష్ భాషలో బోధన ఉంటుంది. తెలంగాణకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఇతర కేటగిరీకి చెందిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా పేర్కొన్నారు.
ప్రోగ్రామ్ పేరు, సీట్ల వివరాలు
-బీఏ (ఆనర్స్) ఫ్యాషన్ డిజైన్ 60సీట్లు
-బీఏ (ఆనర్స్) ఇంటీరియర్ డిజైన్ 40సీట్లు
-బీఏ ( ఫొటోగ్రఫీ అండ్ డిజిటల్ ఇమేజింగ్ ) 20 సీట్లు
మొత్తం సీట్లు 120
కోర్సు వ్యవధి మూడు సంవత్సరాలు
అర్హత:
ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 60శాతం మార్కులతో 2023,2024 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన మహిళా విద్యార్థులు అర్హులు. విద్యార్థి తల్లిదండ్రులకు వార్షిక ఆదాయం రూ. 2,00,000, రూ. 1,50,00 మించి ఉండకూడదు.
వయస్సు: 01-07-2024 నాటికి 16ఏళ్లు నిండి ఉండాలి.
దరఖాస్తు ఫీజు రూ. 300
ఎంపిక విధానం అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం ఆన్ లైన్ లో ఉంటుంది.
ముఖ్యతేదీలు
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభం 10మే 2024
ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ 30 మే 2024
స్పాట్ కౌన్సెలింగ్ తేదీ 5జూన్ 2024