CUET UG 2024 అడ్మిట్ కార్డు రిలీజ్ అయ్యింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG 2024) కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. అడ్మిట్ కార్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ Exams.nta.ac.inలో పూర్తివివరాలు తెలుసుకోవచ్చు.CUET UG అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి, దరఖాస్తు నంబర్,అభ్యర్థి పుట్టిన తేదీ అవసరం ఉంటుంది.
CUET UG 2024: అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా ?
అభ్యర్థులు క్రింద దశలను అనుసరించడం ద్వారా చెక్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
-ముందుగా అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ Exams.nta.ac.inకి వెళ్లండి.
-దీని తర్వాత హోమ్‌పేజీలో CUET UG అడ్మిట్ కార్డ్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
-ఇప్పుడు మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ చేయండి.
-ఇప్పుడు CUET UG అడ్మిట్ కార్డ్‌ని తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేయండి.
-దీని తరువాత, తదుపరి ఉపయోగం కోసం హార్డ్ కాపీని ప్రింట్ తీసుకోండి.
మొదటిసారిగా NTA హైబ్రిడ్ విధానంలో పరీక్షను నిర్వహిస్తోంది. మే 15, 16, 17, 18 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. CUET పరీక్ష 2024 మొత్తం 800 మార్కులతో 2 గంటల పాటు నిర్వహిస్తుంది. CUET 2024లో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. CUET UG 2024 మూడు షిఫ్టులలో నిర్వహిస్తుంది. ఉదయం 9 నుండి 11 వరకు, మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 2 వరకు, సాయంత్రం 4 నుండి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది.
CUET UG సిటీ స్లిప్‌ని డౌన్‌లోడ్ చేయడంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే, అభ్యర్థులు 011-40759000/011 – 69227700 లేదా ఈ-మెయిల్ cuet-ug@nta.ac.inని సంప్రదించవచ్చు.