ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. నవంబర్ 4వ తేదీన శుక్రవారం మరో భారీ జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 15 కంపెనీల్లో దాదాపు 1000 ఉద్యోగాలకు (Jobs) ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళా ద్వారా ముత్తూట్ ఫైనాన్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్, ACT Fiber Net, యలమంచిలి సాఫ్ట్ వేర్ తదితర సంస్థల్లో ఉద్యోగావకాశాలను కల్పించనుంది స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హతలు:
టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపకైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం ఉంటుంది.
ఇంటర్వ్యూలు నిర్వహించే వేదిక:
ఇంటర్వ్యూలను విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, విశాఖపట్నం చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
ఇంటర్వ్యూలను నవంబర్ 4వ తేదీ ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నారు.
ముఖ్య గమనిక: అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume కాపీలు, విద్యార్హతల డాక్యుమెంట్లు వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
-ఇతర వివరాలకు 7989330319, 9959377669 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ లింక్-Link
Thank you for good that to give opportunity.
Thank you
Iam searching for job… My family is very poor.. please help me to get job