నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రెయినీ (EET) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో మొత్తం 864 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 28 నుంచి అప్లికేషన్లను స్వీకరించనుంది. నవంబర్ 11వ తేదీ వరకు అప్లికేషన్ల తుది గడువుగా నిర్ణయించారు.
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితి 27 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా GATE-2022 పరీక్షకు హాజరై ఉండాలి. ఆ పరీక్షలో అభ్యర్థులు చూపిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. నెలకు కనీసం రూ.40 వేల నుంచి రూ.1.40 లక్షల వేతనం ఉంటుంది.