సింగరేణిలో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ లో 327 పోస్టుల భర్తీకి మార్చి 14న నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు కొనసాగిల్సి ఉంది. కానీ పాలనాపరమైన వ్యవహారాల వల్ల నిర్ణీత గడువుతో ప్రారంభం కాలేదు. తాజాగా దరఖాస్తు ప్రారంభం తేదీని సింగరేని యాజమాన్యం ప్రకటించింది. అభ్యర్థుల నుంచి మే 15న మధ్యాహ్నం 12 గంటల నుంచి జూన్ 4న సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, సింగరేణి సంస్థ ఉద్యోగులు రూ. 100చెల్లించాలి. రాతపరీక్ష , ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉద్యోగ ఎంపిక జరుగుతుంది.
నోటిఫికేషన్ ప్రకారం ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లో మేనేజ్ మెంట్ ట్రైనీ 49 పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ లో జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ 100పోస్టులు, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ 33 పోస్టులు, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1లో 47పోస్టులు, ఎలక్ట్రిషియన్ ట్రైనీ కేటగిరిలో 98 పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతానికి పేపరు ప్రకటన మాత్రమే అధికారులు రిలీజ్ చేశారు. అర్హతలు, పోస్టులకు సంబంధించిన పూర్తిస్తాయి నోటిఫికేషన్ అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంది.
ఖాళీల సంఖ్య: 327
ఎగ్జిక్యూటివ్ క్యాడర్: 49 పోస్టులు