పోటీ పరీక్షలు అనగానే చాలా మంది ఒత్తిడికి గురవుతుంటారు. చదవడానికి తక్కువ సమయం ఉందని టెన్షన్ పడుతుంటారు. సరైన ప్రణాళికలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఒత్తిడి జయించి పరీక్షలు బాగా రాసేందుకు పాటించిన పది చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- టైమ్ టేబుల్ సెట్ చేసుకోవాలి:
ముందుగా ఒక టైమ్ టేబుల్ సెట్ చేసుకోవాలి. రోజువారీగా చదవాల్సిన సబ్జెక్టులు, టాపిక్స్ ముందే నిర్దేశించుకోవాలి. ప్రతి సబ్జెక్టును కవర్ చేసుకునే విధంగా ప్లాన్ చేయాలి. - అనువైన వాతావరణం:
మీరు చదువుకునేందుకు ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన వాతావరణంను క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే మీకు చదువుపై మరింత ఏకాగ్రత పెరుగుతుంది. ఇంట్లో, హాస్టల్ లో చదివేవారు స్వచ్చమైన గాలి, నిశ్శబ్దంగా ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి. చదువుతున్నప్పుడు మీ ఫోన్ స్వీచ్ ఆఫ్ కానీ సైలెంట్లో కానీ పెట్టుకోవాలి. - విరామం తీసుకోవాలి:
చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో విరామం తీసుకోవాలి. అప్పుడే మీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. విరామం లేకుండా ఎక్కువ గంటలు చదువుతుంటే కొన్ని సార్లు ఒత్తిడికి లోనయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే చదువు మధ్యలో బ్రేక్ తీసుకోవడం, సరదాగా ఇంట్లో నడవడం లాంటివి చేస్తుండాలి. - హెల్తీ ఫుడ్ తీసుకోవాలి:
మంచి ఆహారపు అలవాట్లు ఎల్లప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. నిద్రలేమి, అలసట నుంచి తప్పించుకోవాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. శరీరం హైడ్రేట్ గా ఉండేందుకు ఎక్కువగా నీరు తాగాలి. గింజలు, పెరుగు తీసుకుంటే ఏకాగ్రత, జ్నాపకశక్తి పెరుగుతుంది. - ఆరోగ్యకరమైన నిద్ర :
ప్రతిరోజూ సరిపడినంత నిద్రపోవాలి. నిద్రించే సమయంలో శరీరం, మెదడు విశ్రాంతి తీసుకుంటాయి. రోజుకు కనీసం 8 గంటల నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమంది అర్థరాత్రి వరకు చదవడానికి ఇష్టపడుతుంటారు. మరికొంత మంది ఉదయాన్నే చదువుతారు. కాబట్టి రోజులు ఎంత సమయం నిద్ర సరిపోతుందో మీరే స్వయంగా నిర్ణయించుకోవాలి.
6 . కంబైన్ స్టడీస్:
అప్పుడప్పుడు కంబైన్డ్ స్టడీస్ కూడా చేయాలి. దీని వల్ల ఎలాంటి సందేహాలు ఉన్నా తీర్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే పక్కన చదువుతున్న వారితో డిస్కస్ చేయడం వల్ల ప్రశ్నలు, సమాధానాలు మీకు గుర్తుండే అవకాశం ఉంటుంది.
- సిలబస్ కంప్లీట్ చేయాలి:
ఏదైనా విషయాన్ని పూర్తి నేర్చుకోవాలంటే క్షుణ్ణంగా చదివి సిలబస్ పూర్తి చేయాలి. చదువుతున్న సమయంలో క్లుప్తంగానోట్స్ తయారు చేయాలి. రివిజన్ సమయంలో ఆ నోట్స్ మీకు బాగా పనికివస్తాయి. - మోడల్ పేపర్స్, పాత ప్రశ్నాపత్రాలు :
సిలబస్ ను పూర్తి చేసిన తర్వాత కచ్చితంగా మోడల్ పేపర్స్, పాత ప్రశ్నాపత్రాలను పరిశీలించాలి. దీని వల్ల పరీక్షల్లో అడుగుతున్న ప్రశ్నల సరళి మీకు తెలుస్తుంది. - రివిజన్ చేస్తుండాలి :
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు సిలబస్ మొత్తాన్ని కచ్చితంగా రివిజన్ చేయాలి. పరీక్షకు ఒక వారం ముందు లేదా కనీసం ఎగ్జామ్ ముందు రోజైనా రివిజన్ చేస్తుండాలి. - నిబంధనల గురించి ముందే తెలుసుకోవాలి:
పరీక్షకు ముందు రోజు బాగా నిద్రించాలి. పరీక్ష హాల్ కు సమాయానికి చేరుకోవాలి. హాల్ టికెట్ లో ఇచ్చిన సమాధానాలు వివరాలను క్షణ్ణంగా చదివి వాటిని ఫాలో అవ్వాలి. ఈ విధంగా పక్కాగా ప్రిపేర్ అయితె ఎలాంటి పరీక్షల్లో అయినా విజయం సాధించడం పక్కా.