దేశవ్యాప్తంగా విద్యార్థులకు పంపిణీచేసే పాఠ్యపుస్తకాల విషయంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కు కేంద్ర విద్యాశాఖ కీలక ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏటా పాఠ్యపుస్తకాలను సమీక్షించి, నవీకరించాలని సూచింనిట్లు సమాచారం. ప్రస్తుతం, వార్షిక ప్రాతిపదికన పుస్తకాలను నవీకరించేందుకు చేసే పద్దతీ ఏమీ లేదు. ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో పాఠ్యపుస్తకాలను క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు సమీక్షించడం ఎంతో ముఖ్యమని భావించిన కేంద్రం, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ఏటా పుస్తకాలను సమీక్షించి, అప్ డేట్ చేయాలని ఎన్సీఈఆర్టీని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.
ఇక 2023లో ఎన్సీఈఆర్టీ ప్రకటించిన కొత్త కరికులమ్ ఫ్రేమ్ వర్క్ ను అనుసరించి పాఠ్య పుస్తకాలను అభివ్రుద్ధి చేస్తుండగా 2026 విద్యా సంవత్సరం నాటికి అన్ని తరగతులకు ఈ పుస్తకాలు సిద్ధం కానున్నాయి. ఈ ఏడాది మూడు, ఆరో తరగతులకు కొత్త పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఇటీవల ఎన్సీఈఆర్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: సింగరేణిలో 327 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ జాబ్స్