HomeLATESTకరెంట్​ ఎఫైర్స్​ ఏప్రిల్​ 2024

కరెంట్​ ఎఫైర్స్​ ఏప్రిల్​ 2024

అంతర్జాతీయం

Advertisement

ప్రపంచ సంపన్నుల జాబితా
అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2024 సంపన్నుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ సంస్థ ఎల్‌వీఎంహెచ్‌ బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం 233 బిలియన్ డాలర్ల (రూ. 19.43 లక్షల కోట్లు)తో అగ్రస్థానంలో ఉన్నారు. ఎలాన్ మస్క్ (195 బి.డా)తో రెండోస్థానం)జెఫ్ బెజోస్ (194 బి.డా) మూడో స్థానంలో ఉండగా, ముఖేష్‌ అంబానీ (116 బి.డా)తో 9వ స్థానంలో నిలిచారు.

కెనడాలో రెయిన్​ ట్యాక్ష్
కెనడా ప్రభుత్వం అక్కడి ప్రజలపై రెయిన్‌ ట్యాక్స్‌ అమలు చేయనుంది. ‘స్ట్రోమ్‌ వాటర్‌ ఛార్జ్‌’ పేరిట టరంటో సిటీలో దీన్ని అమలు చేయనున్నట్లు ఆ ప్రభుత్వం ప్రకటించింది. కెనడాలో అధికభాగం రాతినేలలే ఉండటంతో ప్రత్యేక మురుగునీటి పారుదల వ్యవస్థ స్మార్ట్‌ వాటర్‌ ఛార్జ్‌ను ప్రారంభించింది. దానికి అయ్యే ఖర్చులను రెయిన్‌ట్యాక్స్‌ ద్వారా భర్తీ చేస్తారు.

క్రిస్టోఫ‌ర్ నోల‌న్‌కు నైట్​వుడ్​ పురస్కారం
ప్రముఖ‌ ఫిల్మ్ డైరెక్టర్ క్రిస్టోఫ‌ర్ నోల‌న్‌ను బ్రిటీష్ ప్రభుత్వం నైట్‌వుడ్‌తో స‌త్కరించ‌నున్నది. ఈ ఏడాది నోల‌న్ తీసిన ఓపెన్‌హైమ‌ర్ చిత్రానికి ఆస్కార్ అవార్డులు వచ్చిన విష‌యం తెలిసిందే. క్రిస్టోఫ‌ర్ నోల‌న్ భార్య, ఫిల్మ్ ప్రొడ్యూస‌ర్ ఎమ్మా థామ‌స్‌ను స‌త్కరించ‌నున్నారు.

Advertisement

ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు మృతి
114 సంవత్సరాల వయస్సులో వెనెజులాకు చెందిన జువాన్ విసెంటీ పెరీజ్ మోరా మరణించారు. ఈయ‌న గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం ఆయన ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తి. ఆయనకు 11 మంది పిల్లలు, 41 మంది మనవలు, 18 మంది మునిమనవలు ఉన్నారు.

ఆకస్‌ కూటమిలోకి జపాన్
అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ (ఆకస్​) కూటమి దక్షిణ చైనా సముద్రంలో చైనా కట్టడిని మరింత పటిష్టం చేయడానికి కీలకమైన చర్యలు చేపట్టబోతోంది. తమ కూటమిలోకి జపాన్‌ను తీసుకోవాలని ఈ మిత్రదేశాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

జర్మనీలో గంజాయి చట్టబద్ధం
18 సంవత్సరాలకు పైబడిన పెద్దలకు గంజాయి వినియోగాన్ని జర్మనీ చట్టబద్ధం చేసింది. యూరోపియన్ యూనియన్‌లో ఇలాంటి చర్య తీసుకున్న అతిపెద్ద దేశంగా ఇది నిలిచింది. ఈ చట్టం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది.

Advertisement

క్రిస్టోఫ‌ర్ నోల‌న్‌కు నైట్​వుడ్​ పురస్కారం
ప్రముఖ‌ ఫిల్మ్ డైరెక్టర్ క్రిస్టోఫ‌ర్ నోల‌న్‌ను బ్రిటీష్ ప్రభుత్వం నైట్‌వుడ్‌తో స‌త్కరించ‌నున్నది. ఈ ఏడాది నోల‌న్ తీసిన ఓపెన్‌హైమ‌ర్ చిత్రానికి ఆస్కార్ అవార్డులు వచ్చిన విష‌యం తెలిసిందే. క్రిస్టోఫ‌ర్ నోల‌న్ భార్య, ఫిల్మ్ ప్రొడ్యూస‌ర్ ఎమ్మా థామ‌స్‌ను స‌త్కరించ‌నున్నారు.

ప్రపంచ సంపన్నుల జాబితా
అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2024 సంపన్నుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ సంస్థ ఎల్‌వీఎంహెచ్‌ బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం 233 బిలియన్ డాలర్ల (రూ. 19.43 లక్షల కోట్లు)తో అగ్రస్థానంలో ఉన్నారు. ఎలాన్ మస్క్ (195 బి.డా)తో రెండోస్థానం)జెఫ్ బెజోస్ (194 బి.డా) మూడో స్థానంలో ఉండగా, ముఖేష్‌ అంబానీ (116 బి.డా)తో 9వ స్థానంలో నిలిచారు.

కెనడాలో రెయిన్​ ట్యాక్ష్
కెనడా ప్రభుత్వం అక్కడి ప్రజలపై రెయిన్‌ ట్యాక్స్‌ అమలు చేయనుంది. ‘స్ట్రోమ్‌ వాటర్‌ ఛార్జ్‌’ పేరిట టరంటో సిటీలో దీన్ని అమలు చేయనున్నట్లు ఆ ప్రభుత్వం ప్రకటించింది. కెనడాలో అధికభాగం రాతినేలలే ఉండటంతో ప్రత్యేక మురుగునీటి పారుదల వ్యవస్థ స్మార్ట్‌ వాటర్‌ ఛార్జ్‌ను ప్రారంభించింది. దానికి అయ్యే ఖర్చులను రెయిన్‌ట్యాక్స్‌ ద్వారా భర్తీ చేస్తారు.

Advertisement

ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు మృతి
114 సంవత్సరాల వయస్సులో వెనెజులాకు చెందిన జువాన్ విసెంటీ పెరీజ్ మోరా మరణించారు. ఈయ‌న గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం ఆయన ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తి. ఆయనకు 11 మంది పిల్లలు, 41 మంది మనవలు, 18 మంది మునిమనవలు ఉన్నారు.

జాతీయం

Advertisement

టైగర్‌ ట్రయంప్‌-
భారత్‌- అమెరికా దేశాల మధ్య సముద్రంలో నిర్వహించిన త్రివిధ దళాల ద్వైపాక్షిక విన్యాసాలు (టైగర్‌ ట్రయంప్‌-2024) విజయవంతంగా ముగిశాయి. సహాయ, విపత్తు నివారణ(హెచ్‌ఏడీఆర్‌)కు సంబంధించి చేపట్టిన నమూనా విన్యాసాల ప్రదర్శన ఆకట్టుకుంది.

జీఐ ట్యాగుల్లో ఉత్తరప్రదేశ్ టాప్​
భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ చేయబడిన ఉత్పత్తుల సంఖ్యలో ఉత్తరప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. మొత్తం 69 జీఐ ట్యాగ్‌లతో తమిళనాడును అధిగమించింది. వారణాసి 30 జీఐ ట్యాగ్‌లతో ఒకే భౌగోళిక ప్రాంతం నుంచి అత్యధిక ఉత్పత్తులను కలిగి ఉంది.

సింగపూర్​లో ఫోన్​ పే సేవలు
యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) ద్వారా సింగపూర్‌లో తమ వినియోగదారులు ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చని ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే తాజాగా తెలియజేసింది. ఈ మేరకు సింగపూర్‌ టూరిజమ్‌ బోర్డు (ఎస్‌టీబీ)తో ఒప్పందంపై సంతకాలు చేసినట్లు సంస్థ తెలిపింది.

Advertisement

ఉపాధి హామీ కూలీ పెంపు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలకు రోజూ చెల్లించే కూలిని కేంద్ర ప్రభుత్వం సవరించింది. గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఉపాధి కూలి రూ.272 చెల్లిస్తుండగా తాజాగా రూ. 300లకు పెంచింది.

మిచెల్ తలగ్రాండ్‌కు అబెల్ ప్రైజ్
నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ 2024 అబెల్ బహుమతిని ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ పారిస్, ఫ్రాన్స్‌కు చెందిన మిచెల్ తలగ్రాండ్‌కు ప్రదానం చేసింది. తలగ్రాండ్ ‘గణిత భౌతిక శాస్త్రం, గణాంకాలలో అత్యుత్తమ అనువర్తనాలతో సంభావ్యత సిద్ధాంతం, క్రియాత్మక విశ్లేషణలకు అతని అద్భుతమైన సహకారానికి’ ఈ ప్రతిష్టాత్మక బహుమతిని అందుకున్నాడు.

టైగర్‌ ట్రయంప్‌-
భారత్‌- అమెరికా దేశాల మధ్య సముద్రంలో నిర్వహించిన త్రివిధ దళాల ద్వైపాక్షిక విన్యాసాలు (టైగర్‌ ట్రయంప్‌-2024) విజయవంతంగా ముగిశాయి. సహాయ, విపత్తు నివారణ(హెచ్‌ఏడీఆర్‌)కు సంబంధించి చేపట్టిన నమూనా విన్యాసాల ప్రదర్శన ఆకట్టుకుంది.

Advertisement

ఇండియన్‌ ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ‘దేవిక’
ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ‘డెవిన్‌’కు పోటీగా భారత్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ వీహెచ్‌ ముఫీద్‌ ఓపెన్‌ సోర్స్‌ ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ‘దేవిక’ను రూపొందించారు. ‘ఇదొక ఏజెంటిక్‌ ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.

జీఐ ట్యాగుల్లో ఉత్తరప్రదేశ్ టాప్​
భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ చేయబడిన ఉత్పత్తుల సంఖ్యలో ఉత్తరప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. మొత్తం 69 జీఐ ట్యాగ్‌లతో తమిళనాడును అధిగమించింది. వారణాసి 30 జీఐ ట్యాగ్‌లతో ఒకే భౌగోళిక ప్రాంతం నుంచి అత్యధిక ఉత్పత్తులను కలిగి ఉంది.

సింగపూర్​లో ఫోన్​ పే సేవలు
యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) ద్వారా సింగపూర్‌లో తమ వినియోగదారులు ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చని ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే తాజాగా తెలియజేసింది. ఈ మేరకు సింగపూర్‌ టూరిజమ్‌ బోర్డు (ఎస్‌టీబీ)తో ఒప్పందంపై సంతకాలు చేసినట్లు సంస్థ తెలిపింది.

Advertisement

ఉపాధి హామీ కూలీ పెంపు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలకు రోజూ చెల్లించే కూలిని కేంద్ర ప్రభుత్వం సవరించింది. గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఉపాధి కూలి రూ.272 చెల్లిస్తుండగా తాజాగా రూ. 300లకు పెంచింది.

చంద్రయాన్‌-3 టీమ్​కు అవార్డు
అమెరికా సంస్థ స్పేస్ ఫౌండేషన్, ఇస్రో చంద్రయాన్-3 మిషన్ బృందానికి 2024 జాన్‌ ఎల్‌ జాక్‌ స్విగర్ట్‌ జూనియర్‌ అవార్డును అందించింది. ఈ అవార్డు అంతరిక్ష పరిశోధన, ఆవిష్కరణ రంగాలలో అత్యుత్తమ విజయాలను సాధించిన అంతరిక్ష సంస్థలు, సంస్థలు లేదా కన్సార్టియాలకు ప్రతి సంవత్సరం అందిస్తుంది.

ప్రాంతీయం

Advertisement

సింగరేణి కొత్త రికార్డ్​
బొగ్గు ఉత్పత్తి, వార్షిక టర్నోవర్‌లో సింగరేణి సరికొత్త రికార్డులు సృష్టించింది. గత నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరం (2023-–24)లో సంస్థ చరిత్రలోనే అత్యధికంగా 7.2 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది.

టెలీ సేవల వినియోగంలో రెండో స్థానం
దేశంలో టెలికం సేవల వినియోగంలో 120 శాతంతో కేరళ మొదటి స్థానంలో ఉండగా.. 108.19 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో ఉందని సీఎస్‌ శాంతికుమారి తెలిపారు.

వార్తల్లో వ్యక్తులు

జుడిత్ సుమిన్వ
జుడిత్ సుమిన్వ కాంగో దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానిగా నియమితురాలయ్యారు. గతంలో ఆమె ప్రణాళికా శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ నియామకం కాంగో చరిత్రలో ఒక మైలురాయిని సాధించింది.

సంజయ్ నాయర్
అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్​) కొత్త అధ్యక్షుడిగా ఆర్థిక నిపుణుడు సంజయ్ నాయర్‌ను నియమించింది. గ్లోబల్ ఫైనాన్స్ రంగంలో గౌరవం పొందిన వ్యక్తి. కేకేఆర్​ ఇండియా మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్​గా పని చేశారు.

ప్రొఫెసర్ మీనా చరంద
ఢిల్లీ యూనివర్సిటీలోని కాళింది కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మీనా చరందకు 2024 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన ‘అంతర్జాతీయ సంస్కృతి అవార్డు’ లభించింది. విద్యారంగంలో, సామాజిక సేవలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది.

రవి కోత
అస్సాం రాష్ట్ర 51వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడుకు చెందిన 1993వ బ్యాచ్‌ అస్సాం -మేఘాలయ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి రవి కోత బాధ్యతలు స్వీకరించారు. అస్సాం సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి డాక్టరేట్‌ ఆయనే.

కమల్‌ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. విపత్తు ముప్పు తగ్గించే విషయాల్లో ఆయన సెక్రటరీ జనరల్‌కు సలహాలివ్వనున్నారు. కిశోర్‌కు విపత్తు నిర్వహణ రంగంలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.

మిచెల్ తలగ్రాండ్‌
నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ 2024 అబెల్ బహుమతిని ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ పారిస్, ఫ్రాన్స్‌కు చెందిన మిచెల్ తలగ్రాండ్‌కు ప్రదానం చేసింది. తలగ్రాండ్ ‘గణిత భౌతిక శాస్త్రం, గణాంకాలలో అత్యుత్తమ అనువర్తనాలతో సంభావ్యత సిద్ధాంతం, క్రియాత్మక విశ్లేషణలకు అతని అద్భుతమైన సహకారానికి’ ఈ ప్రతిష్టాత్మక బహుమతిని అందుకున్నాడు.

జుడిత్ సుమిన్వ
జుడిత్ సుమిన్వ కాంగో దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానిగా నియమితురాలయ్యారు. గతంలో ఆమె ప్రణాళికా శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ నియామకం కాంగో చరిత్రలో ఒక మైలురాయిని సాధించింది.

సంజయ్ నాయర్
అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్​) కొత్త అధ్యక్షుడిగా ఆర్థిక నిపుణుడు సంజయ్ నాయర్‌ను నియమించింది. గ్లోబల్ ఫైనాన్స్ రంగంలో గౌరవం పొందిన వ్యక్తి. కేకేఆర్​ ఇండియా మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్​గా పని చేశారు.

ప్రొఫెసర్ మీనా చరంద
ఢిల్లీ యూనివర్సిటీలోని కాళింది కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మీనా చరందకు 2024 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన ‘అంతర్జాతీయ సంస్కృతి అవార్డు’ లభించింది. విద్యారంగంలో, సామాజిక సేవలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది.

రవి కోత
అస్సాం రాష్ట్ర 51వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడుకు చెందిన 1993వ బ్యాచ్‌ అస్సాం -మేఘాలయ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి రవి కోత బాధ్యతలు స్వీకరించారు. అస్సాం సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి డాక్టరేట్‌ ఆయనే.

కమల్‌ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. విపత్తు ముప్పు తగ్గించే విషయాల్లో ఆయన సెక్రటరీ జనరల్‌కు సలహాలివ్వనున్నారు. కిశోర్‌కు విపత్తు నిర్వహణ రంగంలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.

స్పోర్ట్స్​

మియామి ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌
భారత టెన్నిస్‌ వెటరన్‌ స్టార్‌ బోపన్న మియామి ఓపెన్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా)తో కలిసి అతను విజేతగా నిలిచాడు. దీంతో ఏటీపీ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో తిరిగి నంబర్‌వన్‌ స్థానం కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో రెండో సీడ్‌ డోడిగ్‌ (క్రొయేషియా)- ఆస్టిన్‌ (అమెరికా)పై విజయం సాధించారు.

ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ ప్రీ
మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ప్రి రేసును ‘పోల్‌ పొజిషన్‌’తో ప్రారంభించి, కారు ఇంజిన్‌లో సమస్యతో వైదొలగడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఫెరారీ డ్రైవర్‌ కార్లోస్‌ సెయింజ్‌ జూనియర్‌ విజేతగా నిలిచాడు. ఫెరారీ డ్రైవర్‌ చార్లెస్‌ లెక్‌లెర్క్‌ రెండో స్థానంలో నిలిచాడు.

సైన్స్ అండ్​ టెక్నాలజీ

తేజస్‌ ఎంకే1ఏ సక్సెస్​
తేజస్‌ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్‌ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!