ఏఈఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే గడువును టీఎస్పీఎస్సీ మరో అయిదు రోజుల పాటు పొడిగించింది. తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) భారీ ఎత్తున అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టులను భర్తీ చేయనుంది. ముందుగా ప్రకటించిన మేరకు.. సెప్టెంబర్ 22 నుంచి మొదలైన అప్లికేషన్ల ప్రక్రియ అక్టోబర్ 15 నాటికి ముగిసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ గడువును అక్టోబర్ 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.
మిషన్ భగీరథ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ రూరల్ డెవెలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్ అండ్ బీ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. సివిల్ ఇంజనీరింగ్‌తో పాటు ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. విభాగాల వారీగా ఖాళీలను, వయో అర్హతతో పాటు పే స్కేల్ వివరాలను విడుదల చేసింది.
Gourp 1