తెలంగాణాలో ఐదేళ్ల తర్వాత నిర్వహించిన టెట్–2022 ఉత్తీర్ణతా శాతం భారీగా తగ్గడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. టెట్ అధికారులు జూన్ 30న విడుదల చేసిన ఫైనల్ ‘కీ’ ప్రకారం అభ్యర్థులు తమకు వచ్చిన మార్కులను చెక్ చేసుకున్న దానికి ఈ రోజు విడుదల చేసిన ఫలితాలను బేరీజు వేసుకుంటే చాలా తేడాలున్నాయని ఆందోళన చెందుతున్నారు.
ఫైనల్ ‘కీ’లో పేపర్–1లో 4 ప్రశ్నలకు యాడ్స్కోర్, 4 ప్రశ్నలకు 2 ఆప్షన్లు, పేపర్–2కు 4 ప్రశ్నలకు యాడ్స్కోర్, ఒక ప్రశ్నకు 2 ఆప్షన్లు ఇచ్చారు. వీటన్నింటికి లెక్కవేస్తే సుమారు ప్రతి క్యాండిడేట్కు పేపర్–1లో 6 నుంచి 8 మార్కులు, పేపర్–2లో 2 నుంచి 5 మార్కులు కలిసాయి. అయినా కూడా ఉత్తీర్ణతా శాతం తగ్గడం అనుమానాలకు తావిచ్చింది. గతంలో పోల్చుకుంటే ఈసారి టెట్ ప్రశ్నాపత్రం భిన్నంగా ఉందని, కొన్ని ప్రశ్నలు తికమక పెట్టినా.. ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని అందరూ భావించారు. కానీ పేపర్–1లో కేవలం 32.68 శాతం, పేపర్–2లో 49.64 శాతం ఉత్తీర్ణత రావడం అందరినీ ఒకింత ఆశ్చర్యపరిచింది.
టెట్ నోటిఫికేషన్ ప్రకారం 150 మార్కులకు గాను ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 40శాతం, బీసీలకు 50శాతం, ఓసీలకు 60 శాతం మార్కులు రావాలి. క్వాలిఫై పర్సంటేజీ తగ్గడంతో రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు ముందే మరో టెట్ నిర్వహించాలని క్వాలిఫై కానీ అభ్యర్థుల నుంచి డిమాండ్ వస్తోంది.
జిల్లాల వారీగా అభ్యర్థులు క్వాలిఫైడ్ పర్సంటేజీ చూస్తే.. పేపర్–1లో అత్యధికంగా 38.09 శాతం జోగులాంబ గద్వాల, అత్యల్పంగా 27.37 శాతంతో రంగారెడ్డి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. పేపర్–2లో అత్యల్పంగా నారాయణపేట జిల్లా, 56.98 శాతంతో భద్రాద్రి కొత్తగూడెం మొదటి స్థానంలో నిలిచింది.
I got marks in TET- paper 2
74 did l qualify or not
Naku kuda paper 1 lo 73,paper 2 lo 74 Baga rasha ina anthe vachhaye 2 marks add kavali
Malli check chesukovachha
Tet malli veyandi sir plz
Ts tet second time veyandi
P1 lo 94,P2 lo 110
Tet Malli pettandi sir plz
Bc laku 75 marks aythe qualify
Ambika nv fail
Please conduct again TET with in 6months before TRT Sir