తెలంగాణ టెట్ ఫలితాలు కాసేపటి క్రితం విడుదలయ్యాయి. రాష్ట్రంలో ఐదేళ్ల తర్వాత టెట్ పరీక్ష నిర్వహించడంతో బీ.ఈడీ, డీ.ఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు భారీ స్థాయిలో దరఖాస్తు చేసుకున్నారు. పేపర్–1, పేపర్–2 కలిపి 6లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. జూన్ 12న నిర్వహించిన ఈ పరీక్షకు పేపర్–1కు 3,18,444 మంది హాజరుకాగా ఇందులో కేవలం 1,0478 మంది(32.68) మాత్రమే క్వాలిఫై అయ్యారు. దాదపు 2లక్షలకు పైగా అర్హత సాధించలేకపోయారు. పేపర్–2కు 2,50897 మంది హాజరుకాగా 1, 24, 535 మంది (49.64 శాతం) క్వాలిఫై అయ్యారు. పేపర్–2 రాసిన బీఈడీ అభ్యర్థుల ఉత్తీర్ణత కొంత మెరుగ్గా ఉన్నా.. పేపర్–1లో మాత్రం క్వాలిఫై కాలేకపోయారు. ఈ సారి బీఈడీ అభ్యర్థులకు పేపర్–1కు అవకాశం ఇవ్వడమే ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు.
Hindi pandit student mainly not qualify paper 2 ,Hindi subject related questions not given