తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి అఫిషియల్ కీ రెండు రోజుల్లో వెలువడనుంది. ఈసారి పేపర్ ఈజీగా రావటంతో ఎక్కువ మంది క్వాలిఫై అయ్యే అవకాశాలున్నాయి. గతంలో ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో ఎక్కువ తప్పులు చోటు చేసుకోవటంతో (TSLPRB) పోలీస్ బోర్డు ఈసారి పరీక్ష పత్రం తయారీలో జాగ్రత్తలు తీసుకున్నట్లు కనబడింది. అన్ని విభాగాల్లోనూ ఎక్కువ ప్రశ్నలు డైరెక్ట్ గా అడగటంతో చాలా మంది అభ్యర్థులు సులభంగా సమాధానాలు గుర్తించ గలిగారు. ఎస్‌ఐ ప్రిలిమ్స్‌తో పోల్చితే కానిస్టేబుల్ పరీక్షలో ఎక్కువ మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యే అవకాశాలున్నట్లు కోచింగ్ సెంటర్ల నిర్వహకులు అంచనా వేస్తున్నారు.
ఈసారి అర్థమెటిక్ నుంచి 22 ప్రశ్నలు వచ్చాయి. అందులో 10 ప్రశ్నలు ఈజీగా, మిగిలినవి టైమ్ టేకింగ్ గా ఉన్నాయి. రీజనింగ్ నుంచి 20 ప్రశ్నలు రాగా అందులో 18 సులభంగా ఉన్నాయి. జనరల్ స్టడీస్‌లో భాగమైన ఇండియన్ హిస్టరీ, సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నలు కూడా ఈజీగానే వచ్చాయి. ఉదాహరణకు తెలంగాణ హిస్టరీకి సంబంధించిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి..
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లును లోక్‌సభ ఏ రోజు అంగీకరించింది?
- కాకతీయుల కాలానికి చెందిన ‘శివయోగసారం’ అనే గ్రంథ రచయిత ఎవరు?
- హనుమకొండలోని ప్రసిద్ద ‘సిద్దేశ్వర ఆలయ’ నిర్మాత ఎవరు?
- ‘నీతి సారం’ గ్రంథ రచయిత ఎవరు?
- బుద్ధవనం ఎక్కడ కలదు?
TELANGANA CONSTABLE PRELIMINARY WRITTEN TEST 2022
QUESTION PAPER ANALYSIS
సిలబస్ టాపిక్స్ | ప్రశ్నలు |
ఇంగ్లిష్ | 25 |
అర్థమెటిక్ అండ్ రీజనింగ్ | 42 |
ఫిజికల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ | 28 |
బయాలజీ | 5 |
ఇండియన్ హిస్టరీ | 30 |
జాగ్రఫీ | 21 |
పాలిటీ | 10 |
ఎకానమీ | 5 |
తెలంగాణ హిస్టరీ | 20 |
కరెంట్ అఫైర్స్ | 14 |
నోట్: www.merupulu.com నిర్వహించిన డెయిలీ టెస్ట్‌లు, రివిజన్ టెస్ట్ ల నుంచి ఈ ఎగ్జామ్‌లో దాదాపు 85 శాతం ప్రశ్నలు వచ్చాయి. అందుకే కానిస్టేబుల్, ఎస్‌ఐ మెయిన్ ఎగ్జామ్ తో పాటు రాబోయే టీఎస్పీఎస్సీ పరీక్షలకు ఉపయోగపడే డెయిలీ టెస్ట్ లు, సబ్జెక్ట్ వైజ్ బిట్ బ్యాంక్‌ను ఫాలో అవండి.
త్వరలోనే సబ్జెక్ట్ వైజ్.. పోటీ పరీక్షల సిలబస్‌కు అనుగుణంగా అత్యంత ప్రామాణికమైన ఈ బుక్స్ ను అందిస్తాం. ALL THE BEST