టీఎస్ ఎంసెట్‌కు ఈయేడాది భారీగా అప్లికేషన్లు వచ్చాయి. ఇప్పటి వరకూ 2,50,466 మంది అప్లై చేసుకున్నారు. ఇంజినీరింగ్ 1,64,298 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్‌కు 86,168 మంది దరఖాస్తు చేశారు. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది 28 వేలకుపైగా అప్లికేషన్లు ఎక్కువగా వచ్చాయి. 500 రూపాయల ఫైన్‌తో జులై 29 వ తేదీ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉండటంతో అప్లికేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
ఇప్పటికే ఎం సెట్-2021 హాల్ టికెట్ లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ఈనెల 31 వరకు వెబ్ సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశముందని ఎంసెట్ కన్వీనర్ గోవర్థన్ తెలిపారు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్,క్వాలిఫయింగ్ పరీక్ష హాల్ టికెట్ నంబర్,పుట్టిన తేదీ ల తో వాటిని డౌన్ లోడ్ చేసుకొవచ్చు.
హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకునే లింక్
https://eamcet.tsche.ac.in/TSEAMCET
వచ్చేనెల 4 నుంచి 10 వరకు ఎంసెట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.
తెలంగాణ ఎంసెట్ కు భారీ పోటీ.. హాల్ టికెట్లు రెడీ.. అప్లై చేయని వారికి 29 వరకు ఛాన్స్
Advertisement