తెలంగాణా పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్)-2021 ఫలితాలు విడుదలయ్యాయి. బాసరలోని ఆర్‌జీయూకేటీ సీట్లతో పాటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ డిప్లొమా కోర్సుల అడ్మిషన్లను ఇందులో వచ్చిన మెరిట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తారు.
POLYCET-2021 ప్రవేశ పరీక్ష ఫలితాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ సెక్రటరీ నవీన్ మిట్టల్ విడుదల చేశారు.
ఈ ఏడాది మొత్తం 1,02,496 అభ్యర్థులు అప్లై చేయగా.. 92,557 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 75666 మంది విద్యార్థులు (81.75 శాతం) ఉత్తీర్ణత సాధించారు. హాజరైన 53,371 బాలురకు 42,595 మంది (79.81 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 39,186 బాలికలకు గాను 33,071 మంది (81.75 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
రిజల్ట్ కోసం క్లిక్ చేయండి;
https://polycetts.nic.in/rank_card.aspx
https://www.vidyavision.com/results/tspolycet2021.htm
ఇప్పటికే అడ్మిషన్ల షెడ్యూలును టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ రిలీజ్ చేసింది. షెడ్యూలు ప్రకారం
ఆగస్ట్ 5 వ తేదీ నుంచి ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్
ఆగస్ట్ 14 వ తేదీ ఫస్ట్ పేజ్ సీట్ల అలాట్మెంట్ జాబితా
ఆగస్ట్ 21 వ తేదీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్
ఆగస్ట్ 27 వ తేదీ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్
