HomeLATESTఎంసెట్​, నీట్,​ ఐఐటీ షార్ట్ టర్మ్​ ఆన్​లైన్​ కోచింగ్​: ఉచితంగా అందిస్తున్న తెలంగాణ గవర్నమెంట్​

ఎంసెట్​, నీట్,​ ఐఐటీ షార్ట్ టర్మ్​ ఆన్​లైన్​ కోచింగ్​: ఉచితంగా అందిస్తున్న తెలంగాణ గవర్నమెంట్​

ఎంసెట్, నీట్, ఐ ఐ టి కు సిద్దమవుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా షార్ట్ టైం ఆన్లైన్ కోచింగ్ అందిస్తోంది. ఈ అవకాశాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో పాటు ప్రయివేటు కళాశాలలో చదువుకున్న విద్యార్థులు వినియోగించుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి కోరారు. శుక్రవారం నుంచి ఈ ఆన్లైన్ కోచింగ్ ను ప్రారంభించారు. సబ్జెక్టు నిపుణులైన లెక్చరర్లు ఈ ఆన్ లైన్​ కోచింగ్​ అందిస్తున్నారు. ఇవి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి ప్రకటించారు. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ఈ కోచింగ్​ ఉంటుందని, తక్కువ టైమ్​లో ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందన్నారు. గత ఏడాది కూడా ఎంసెట్, నీట్, ఐ ఐ టి కి సిద్దమైన విద్యార్థులకు ఆన్లైన్ కోచింగ్ ఇవ్వగా రాష్ట్రంలోని, ఇతర రాష్ట్రాలకు చెందిన 20 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2685 మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు.

ఆన్లైన్ కోచింగ్ లింక్​ http://tscie.rankr.io

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!