స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ 25,271 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సెక్రటేరియల్ సెక్యూరిటీ ఫోర్స్, రైఫిల్‌మెన్ ఇన్ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుల్ పోస్టులు ఇందులో ఉన్నాయి. టెన్త్ పాసైన అభ్యర్థులు ఆగస్టు 31వ తేదీ లోపు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 25, 271
బీఎస్ఎఫ్ – 7545
సీఐఎస్ఎఫ్ – 8464
ఎస్ఎస్బీ – 3806
ఐటీబీపీ – 1431
ఏఆర్ – 3785
ఎస్ఎస్ఎఫ్ – 240
పదోతరగతి పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా గరిష్ట వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్ 3 స్థాయి వేతనం లభిస్తుంది
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
ఎగ్జామ్ ప్యాటర్న్: ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్ ఇంటలిజెన్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవర్నెస్, మాథమెటిక్స్, ఇంగ్లీష్ లేదా హిందీపై ప్రశ్నలు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం: 17 జులై
చివరితేది: ఆగస్టు 31
అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరితేది: 2 సెప్టెంబర్
సీబీటీ ఎగ్జామ్ తేది: త్వరలో ప్రకటిస్తారు. వెబ్సైట్: www.ssc.nic.in
టెన్త్ పాసైతే చాలు.. 25272 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
Advertisement
Advertisement