జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ ను ఆగస్టు 11 వ తేదీన నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తం గా 11,182 సెంటర్లలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఏప్రిల్లో జరగాల్సిన ఈ పరీక్షను కోవిడ్ తీవ్రత కారణంగా నవోదయ విద్యాలయ సమితి వాయిదా వేసింది. మొత్తం 2.41 లక్షల మంది ఈ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 47,320 విద్యార్థులకు ఎంట్రన్స్ లో వచ్చే మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు.
తెలంగాణలో నవోదయ స్కూల్స్
కాగజ్‌నగర్ (ఆదిలాబాద్)
చొప్పదండి (కరీంనగర్)
పాలేరు, భద్రాచలం (ఖమ్మం)
వట్టెం (మహబూబ్‌నగర్)
వర్గల్ (మెదక్)
చలకుర్తి క్యాంప్ (నల్లగొండ)
నిజాంసాగర్ (నిజామాబాద్)
మామునూరు (వరంగల్)
గచ్చిబౌలి (రంగారెడ్డి)
