రాష్ట్రవ్యాప్తంగా 3.80 లక్షల మంది ఈనెల 16న జరిగే గ్రూప్ 1 (GROUP 1) ప్రిలిమినరీ ఎగ్జామ్ రాస్తున్నారు. TSPSC టీఎస్పీఎస్సీ అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 33 జిల్లా కేంద్రాల్లో 1,019 ఎగ్జామ్ సెంటర్లలో పరీక్ష నిర్వహణకు సన్నాహాలు చేసింది. ఏయే జిల్లాలో ఎంత మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారనే వివరాలను తాజాగా విడుదల చేసింది.
DIST NAME | NO OF VENUES | TOTAL CANDTS | |
1 | ADILABAD | 19 | 6190 |
2 | NIZAMABAD | 40 | 12858 |
3 | KARIMNAGAR | 35 | 16824 |
4 | HANMAKONDA | 49 | 21024 |
5 | KHAMMAM | 58 | 17366 |
6 | HYDERABAD | 106 | 51851 |
7 | RANGA REDDY | 128 | 51718 |
8 | MEDCHAL-MALKAJGIRI | 115 | 51931 |
9 | NALGONDA | 52 | 16084 |
10 | MAHABUBNAGAR | 34 | 12123 |
11 | SANGAREDDY | 26 | 8654 |
12 | KUMRAM BHEEM ASIFABAD | 10 | 2377 |
13 | MANCHERIAL | 27 | 9243 |
14 | NIRMAL | 19 | 4492 |
15 | KAMAREDDY | 9 | 4549 |
16 | JAGTIAL | 21 | 6885 |
17 | PEDDAPALLY | 16 | 6067 |
18 | RAJANNA SIRICILLA | 17 | 4266 |
19 | WARANGAL | 27 | 9716 |
20 | JANGAON | 14 | 3410 |
21 | MAHABUBABAD | 15 | 4052 |
22 | JAYA SHANKAR BHUPALAPALLY | 9 | 2373 |
23 | MULUGU | 7 | 1933 |
24 | BHADRADRI-KOTHAGUDEM | 23 | 8851 |
25 | YADADRI-BHUVANAGIRI | 13 | 3644 |
26 | SURYAPET | 31 | 9181 |
27 | MEDAK | 7 | 3293 |
28 | SIDDIPET | 20 | 7786 |
29 | JOGULAMBA-GADWAL | 15 | 4874 |
29 | WANAPARTHY | 16 | 4343 |
30 | NAGARKURNOOL | 20 | 5134 |
31 | NARAYANAPET | 7 | 2132 |
32 | VIKARABAD | 14 | 4857 |
33 | Grand Total | 1019 | 380081 |
ఇప్పటికే అభ్యర్థులు పాటించాల్సిన నియమ నిబంధనల జాబితాను ఇప్పటికే విడుదల చేసింది. పరీక్ష నిర్వహణకు సంబంధించి అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసేందుకు వీలుగా హెల్ప్ లైన్ (HELP LINE) ఏర్పాటు చేసింది. జిల్లాల వారీగా హెల్ప్ లైన్ నెంబర్ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ముగిసిన తర్వాత మూడురోజుల్లో ప్రాథమిక కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేందుకు టీఎస్పీఎస్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 20లోపు ‘కీ’ విడుదలయ్యేలా టెంటెటివ్ షెడ్యూలు సిద్ధం చేసింది. దానిపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత నిపుణుల కమిటీ ఫైనల్ ‘కీ’ని ప్రకటిస్తుంది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను రెండు నెలల్లో ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. ఈ లెక్కన ఫిబ్రవరిలో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి.