గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉన్న అభ్యర్థులందరూ వెంటనే మెయిన్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఈసారి మెయిన్స్ పరీక్ష ఎలా ఉంటుంది, ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలనేది సబ్జెక్ట్ నిపుణులు అందించిన సూచనలు ఇక్కడ అందిస్తున్నాం. మెయిన్స్ తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగతా ఆరు పేపర్లు మూడు భాషల్లోనూ రాయవచ్చు. క్వాలిఫైయింగ్ పేపర్ జనరల్ ఇంగ్లిష్ దాదాపు ఎస్‌ఎస్‌సీ సిలబస్ అనుసరించి ఉంటుంది.
పేపర్1 – జనరల్ ఎస్సే:
జనరల్ ఎస్సే కోసం ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. కానీ ప్రాక్టీస్ తప్పనిసరి ఉండాలి. దీనిలో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. 1) సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు– ఆర్థిక అభివృద్ధి, న్యాయపరమైన అంశాలు, 2) భారత రాజకీయ స్థితిగతులు–భారతీయ చరిత్ర సాంస్కృతిక వారసత్వం,3) సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి– విద్య, మానవ వనరుల అభివృద్ధి ఇలా మూడు సెక్షన్లుగా విభజిస్తారు. ప్రతి సెక్షన్కు 2 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. అందులో ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి. సంపూర్ణ అవగాహన ఉన్న సబ్జెక్ట్ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఉదాహరణకు సెక్షన్2లో భారత రాజకీయాలు లేదా భారత చారిత్రక, సాంస్కృతిక సంపద అంశాలు ఉంటాయి. ఇందులో చరిత్ర మీద పట్టు ఉంటే రెండో దాన్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్.
పేపర్ 2, సెక్షన్–1 భారతదేశ చరిత్ర, ఆధునిక చరిత్ర:
డిగ్రీలో చరిత్ర నేపథ్యం లేని అభ్యర్థులకు ఈ సెక్షన్ చదవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కారణం ప్రాచీన, మధ్యయుగ చరిత్రకు రెండు యూనిట్లలో ఎక్కువ సమయం కేటాయించాలి. మంచి వ్యూహంతో చదివితే సులభం అవుతుంది. 3,4,5 యూనిట్లు ఆధునిక చరిత్రకు సంబంధించినవి అయితే సిలబస్ ప్రకారం ఎక్కువగా కనబడిన, స్థూలంగా చూస్తే సమాధానాలు రాయచ్చు. చరిత్రకు సంబంధించి ప్రామాణికమైన పుస్తకాలను చదివి సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి. రోజుకు కనీసం ఐదు ప్రశ్నలు రాసి సంబంధిత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్తో కరెక్షన్ చేపించుకుంటే అందరికంటే ప్రతి ప్రశ్నకు ఒకటి లేదా రెండు మార్కులు అదనంగా పొందవచ్చు. చరిత్ర సబ్జెక్టుకు ‘కీ పదాలు’ చాలా ముఖ్యం. ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకోకపోతే సమాధానం పక్కదారి పడుతుంది. కీ పదాలు అంటే ఉదాహరణకు ‘వర్ణించండి’ అన్నప్పుడు వివరించకూడదు, సాధ్యమైనంత వరకు వాస్తవ ఆధారాలతో సమాధానం రాయాలి.
పేపర్ 2, సెక్షన్–2 తెలంగాణ చరిత్ర, ఆధునిక చరిత్ర:
ప్రాచీన తెలంగాణ చరిత్రకు సంబంధించి స్టాండర్డ్ పుస్తకాలను మాత్రమే చదవాలి. లోకల్ పుస్తకాలలో చాలా వరకు ప్రామాణికమైన సమాచారం లేదు. చరిత్రను బాగా అవగాహన చేసుకుంటే కాని సమాధానం సరిగ్గా రాయలేము. ఉదాహరణకు హెరిటేజ్ గురించి రాయమంటే హెరిటేజ్ అనే పదాన్ని బ్రాడ్గా అర్థం చేసుకోవాలి. అసఫ్జాహీ వంశం గురించి నేర్చుకోవడం అంటే మొత్తం అసఫ్జాహీల చరిత్ర చదవడం కాదు. సిలబస్లో ఉన్న అంశాలపై మాత్రమే ఫోకస్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఉదాహరణకు ఆరవ నిజాం, ఏడో నిజాం పాలనలో సామాజిక, ఆర్థిక అభివృద్ధి గురించి మాత్రమే చదవాలి. అంతే కాని మరో అంశం మీద దృష్టి పెట్టకూడదు. సమాధానం రాయడంలో ‘నిర్మాణం’ చాలా ముఖ్యం. ఒక ప్రశ్నకు ప్రారంభం, బాడీపార్ట్, ముగింపు సరైన పద్ధతిలో రాయాలి. ఆధునిక తెలంగాణ చరిత్రలో కొన్ని అంశాలు తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉన్నాయి అనుకుంటారు. కాని వాస్తవంగా సిలబస్లో ఇచ్చిన అంశాలు వేర్వేరు. ఆధునిక తెలంగాణ చరిత్రలో ముఖ్యంగా పోలీస్ యాక్షన్, భారత యూనియన్లో హైదరాబాద్ రాజ్యం విలీనం టాపిక్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి.