తెలంగాణలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను మంజూరు చేస్తూ కేసీఆర్ సర్కార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫైర్ స్టేషన్‌ల ఏర్పాటుతో పాటు అగ్నిమాపక శాఖలో ఖాళీల భర్తీకి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కొత్త అగ్నిమాపక కేంద్రాలతో పాటు భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలతో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. మంజూరైన 382 పోస్టుల్లో 367 రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి.. మరో 15 పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఈ కొత్త ఫైర్ స్టేషన్లతో పాటు ఇప్పటికే ఉన్న కేంద్రాల్లోని ఖాళీలను సైతం భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో త్వరలోనే ఫైర్ స్టేషన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది తెలంగాణ సర్కార్.
నియోజక వర్గాల వారీగా కొత్తగా ఏర్పాటయ్యే ఫైర్ స్టేషన్లు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా – మల్కాజిగిరి.
రంగారెడ్డి జిల్లా – ఎల్.బి.నగర్, రాజేంద్రనగర్, షాద్ నగర్
హైదరాబాద్ జిల్లా – అంబర్ పెట్, చాంద్రాయణ గుట్ట, జూబ్లీ హిల్స్
జనగామ – స్టేషన్ ఘనపూర్
మహబూబాబాద్ – డోర్నకల్
మెదక్ – నర్సాపూర్
సిద్ధిపేట – హుస్నాబాద్
నాగర్ కర్నూల్ – కల్వకుర్తి
నిజామాబాద్ – బాల్కొండ
జగిత్యాల – ధర్మపురి
భద్రాద్రి కొత్తగూడెం – పినపాక