పోటీ పరీక్షల ప్రత్యేకం: ఈ టాపిక్ మిస్సయితే మార్కులు కోల్పోతారు
జి20 సదస్సు (G20 or Group of Twenty)… ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతి వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల అధినేతల వార్షిక సమావేశమే జి20 సదస్సు (G20 or Group of Twenty). అంతర్జాతీయ సంస్థల్లో ఇది అత్యంత శక్తిమంతమైంది. ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులు, ప్రపంచ జీడీపీలో 85శాతం వాటా జి–20 దేశాలదే. 17వ జి–20 సదస్సు ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. వచ్చే ఏడాది ఈ సమావేశాలు భారత్‌లో జరుగనున్నాయి. రాబోయే పోటీ పరీక్షలన్నింటిలో జీ 20 సదస్సుపై ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది. అభ్యర్థులందరూ దానికి సంబంధించిన ముఖ్యాశాలు.. కీ నోట్స్ తప్పకుండా తెలుసుకోవాలి.
సభ్య దేశాలు:
అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, రష్యా, మెక్సికో, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, గ్రేట్ బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్. 2008 నుంచి స్పెయిన్ శాశ్వత ఆహ్వానిత దేశం. జీ20లో పాకిస్థాన్ లేదు
ఆవిర్భావం :
1997లో తూర్పు ఆసియాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం చాలా దేశాలపై ప్రభావం చూపడంతో ప్రపంచంలో ఆర్థికంగా శక్తిమంతమైన దేశాలన్నీ కలిసి ఈ గ్రూప్ ఏర్పాటు చేయాలని భావించాయి. అప్పటికే ప్రపంచంలో అత్యంత సంపన్న ఆర్థిక వ్యవస్థలతో కూడిన గ్రూప్ ఆఫ్ ఎయిట్(జి–8) బృందాన్ని విస్తరించి చైనా బ్రెజిల్, సౌదీ అరేబియా తదితర వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను ఇందులో చేర్చారు. సభ్య దేశాలు 19, యూరోపియన్ యూనియన్‌తో కలిపి జి20గా పేర్కొంటారు.
ఫస్ట్ సమ్మిట్:
మొదటిసారి 1999లో బెర్లిన్‌లో జీ 20 సదస్సు జరిగింది. మొదట్లో ఆయా దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్లు ఈ సదస్సుకు హాజరయ్యే వారు. 2008లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో బ్యాంకులు కుప్పకూలడం, నిరుద్యోగం పెరగడం, వేతనాల్లో మాంద్యం కారణంగా సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులకు జీ 20 ఒక అత్యవసర మండలిగా మారింది.
జి–20 ప్రభుత్వాల అధినేతలు 2008 నుంచి ప్రతి ఏడాది సభ్య దేశాల్లో సమావేశమవుతున్నారు. తొలి సదస్సు అమెరికా రాజధాని వాషింగ్జన్ డి.సి.లో జరిగింది. జి20కి ప్రధాన కార్యాలయం వంటిది ఏమీ లేదు. ఏ దేశంలో సదస్సు నిర్వహిస్తారో ఆ దేశమే ఏర్పాట్లు చేస్తుంది. ఆ దేశమే అధ్యక్షత వహిస్తుంది.
సమావేశాలు:
ఈ అధ్యక్ష ఎన్నిక కోసం జి20ని ఐదు గ్రూపులుగా విభజించారు. గ్రూపుల వారీగా అధ్యక్ష బాధ్యతలు అందుతాయి. ఈ గ్రూపులో ఓటింగ్ నిర్వహించి ఎంపిక చేస్తారు. 2023లో భారత్‌లో జి–20 సదస్సు జరగనుంది. జి–20 దేశాల అధినేతలు సంవత్సరానికి ఒకసారి సమావేశమైతే, ఆయా దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు రెండు సార్లు సమావేశమై అనేక అంశాలపై చర్చిస్తారు. వరల్డ్ బ్యాంక్, ఐరాస, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఓఈసీడీ, డబ్ల్యూహెచ్‌వో, ఐఎంఎఫ్, డబ్ల్యూటీవో, ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్‌లు ఈ సమావేశాల్లో పాల్గొంటాయి.
లక్ష్యాలు
1. సుస్థిరాభివృద్ధిని, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడానికి సభ్య దేశాల మధ్య సహకారం పెంపొందించడం
2. భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాలు పునరావృతం కాకుండా ఆర్థిక నియంత్రణ చర్యలు చేపట్టడం
3. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను ఆధునికీకరించడం, సభ్య దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించడం
బాలీ సదస్సు (G20 summit in Bali)
17వ G20 summit నవంబర్ 15 నుంచి 16 వరకు ఇండోనేషియాలోని బాలిలో జరిగింది.
మోటో: రికవర్ టుగెదర్, రికవర్ స్ట్రాంగర్.
ఆహ్వానిత దేశాలు: కొలంబియా, ఫిజి, నెదర్లాండ్స్, రువాండ, సెహగల్, సింగపూర్, స్పెయిన్, ఉక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సురినామ్.
అతిథ్య అంతర్జాతీయ సంస్థలు: ఫిఫా, వరల్డ్ బ్యాంక్, యునైటెడ్ నేషన్స్, ఐఎంఎఫ్, డబ్ల్యూటీఓ, ఐఓసీ, డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇస్లామిక్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్.
ముగింపు కార్యక్రమంలో కూటమి అధ్యక్ష బాధ్యతలను ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ప్రధాని మోడీకి లాంఛనంగా అప్పగించారు. డిసెంబర్ 1 నుంచి ఈ బాధ్యతను భారత్ స్వీకరించనుంది.
17వ సదస్సు డిక్లరేషన్
ఉక్రెయిన్‌లో అరాచకాలకు, యుద్ధానికి తెరపడాలి. యుద్ధం కొనసాగితే ఆహార, ఇంధన భద్రతలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని డిక్లరేషన్ పేర్కొంది. సంక్షోభ నివారణకు కృషి, చర్చలు ఇప్పుడు కీలకం. ఇది యుద్ధాలు చేసుకొనే శకం కాదని సభ్యదేశాలు పేర్కొన్నాయి. శాంతి స్థాపన, కాల్పుల విరమణ, ఉద్రిక్తతల నివారణకే జి–20 దేశాలు పిలుపునిచ్చాయి. ఉగ్రవాదానికి నిధులందించే కార్యకలాపాల కట్టడికి దేశాలన్నీ కలిసి రావాలని కోరాయి.
డ్రాప్ట్ స్టేట్మెంట్
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ఖండిస్తూ జి–20 సదస్సులో ఒక ముసాయిదా నివేదికను విడుదల చేశారు. ఉక్రెయిన్ నుంచి రష్యా తన సైన్యాన్ని బేషరతుగా పూర్తిస్థాయిలో ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌ను ప్రస్తావించారు. జి–20 సదస్సుకు రష్యా తరఫున విదేశాంగ మంత్రి లావ్రోవ్ హాజరయ్యారు.
Good
Good thinking and nice 👍use to more than peoples and good news also
Good aidea