తెలంగాణలో పదోతరగతి ఫలితాలు జూన్ 30న విడుదల కానున్నాయి. మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులతో సమావేశమై టెన్త్ ఫలితాల విడుదలపై సమీక్షించారు. ఈ మేరకు ఈ నెల 30న గురువారం విడుదల చేయాలని ఎస్ఎస్సీ బోర్డ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మే 23న ప్రారంభమైన ఎగ్జామ్స్ మే 28తో ముగిశాయి. జూన్ 1న ఒకేషనల్ విద్యార్థులకు పూర్తయ్యాయి. జూన్ 2 నుంచి తెలంగాణ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభించారు. ఈ ఏడాది 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 99 శాతం మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు.
SSC result of Telangana 10 class