తెలంగాణ టెట్ ఫలితాలు జులై1న విడుదల చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం మంత్రి చాంబర్లో జరిగిన సమావేశంలో విద్యాశాఖ పనితీరుపై సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ సంచాలకులు దేవసేన, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ (టెట్ కన్వీనర్) రాధారెడ్డి, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెట్ ఫలితాలపై సమీక్షించిన మంత్రి ఎలాంటి జాప్యం చేయకుండా జులై 01న ఫలితాలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జూన్ 12న జరిగిన టెట్ పరీక్షకు పేపర్–1, పేపర్–2 కలిపి సుమారు 3.8 లక్షల మంది హాజరయ్యారు.
జులై 01న టీఎస్ టెట్ ఫలితాలు
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS
Vgunjinbh