HomeLATESTటెన్త్ పేపర్​లో మార్పులు

టెన్త్ పేపర్​లో మార్పులు

టెన్త్ విద్యార్థులకు కొత్త వార్త. తెలంగాణ విద్యాశాఖ ఈ ఏడాది టెన్త్ పేపర్​ ప్యాటర్న్​ను మార్చేసింది. ఇప్పటికే టెన్త్ లో 11 పేపర్లను ఆరు పేపర్లకు కుదించింది. కొత్త పేపర్లలో క్వశ్చన్ల ను తగ్గించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. అందుకు అనుగుణంగా క్వశ్చన్​ పేపర్​లో మార్పులు చేసింది. బుధవారం రాత్రి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
  • గతంలో ఎస్సే టైప్​ క్వశ్చన్లలో ఒక్కో విభాగంలో రెండు ప్రశ్నలు ఇచ్చి వాటిలో ఒకటి రాయాలనే ఆప్షన్​ ఉండేది. మొత్తం ఆరు విభాగాల నుంచి ఆరు ప్రశ్నలు రాయాల్సి ఉండేది. ఇప్పుడు విభాగాల వారీగా ఛాయిస్​ తీసేశారు. మొత్తం ఆరు ప్రశ్నలు ఇస్తే.. అందులో నాలుగింటికి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక్కో క్వశ్చన్​కు గతంలో ఐదు మార్కులు ఉండగా, ఇప్పుడు ఒక్కో ఎస్సే టైప్ క్వశ్చన్​కు ఆరు మార్కులు కేటాయించారు.
  • గతంలో ఉన్న మూడు మార్కుల  ప్రశ్నలను ఇప్పుడు నాలుగు మార్కుల ప్రశ్నలుగా పరిగణిస్తారు. ఆరు ప్రశ్నలుంటాయి. అన్నింటికీ సమాధానాలు రాయాలి. అందులో ఛాయిస్​ ఏమీ లేదు.
  • వెరీ షార్ట్  ఆన్సర్ క్వశ్చన్లు, మల్టిపుల్​ చాయిస్​ క్వశ్చన్లలో మార్పేమీ లేదు. వెరీ షార్ట్ ఆన్సర్​ క్వశ్చన్లు 6 ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులుంటాయి.
  • మొత్తం 20 మల్టిపుల్​ చాయిస్​ ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు.
  • తొమ్మిదవ తరగతితో పాటు టెన్త్ స్టూడెంట్లకు ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది కూడా ఈ కొత్త ప్యాటర్న్​ పేపర్​ అమల్లో ఉంటుంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!