రాష్ట్రంలో 5089 టీచర్ పోస్టుల భర్తీ (DSC 2023) కి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. 2,575 ఎస్జీటీ,1,739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏయే జిల్లాలో ఎన్ని ఖాళీలున్నాయనే వివరాలను ఇటీవల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. జిల్లాల వారీగా ఏయే పోస్టులు, ఎన్ని ఖాళీలున్నాయనే వివరాలన్నీ ఈ జాబితాలో ఉన్నాయి. టీచర్ పోస్టులకు ఎదురుచూస్తున్న లక్షలాది అభ్యర్థులకు ఉపయోగపడే ఈ జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 358, నిజామాబాద్ జిల్లాలో 309 ఖాళీలున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అతి తక్కువగా 43, హన్మకొండలో 53 ఖాళీలు మాత్రమే ఉన్నాయి.

DISTRICT WISE TEACHER POST VACANCIES
