తెలంగాణ స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ (తెలంగాణ సెట్) TS SET 2022 నోటిఫికేషన్ విదుదలైంది. ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్ష నిర్వహించనుంది. అందుకు సంబంధించిన షార్ట్ నోట్‌ను ఉస్మానియా యూనివర్సిటీ రిలీజ్ చేసింది. యూనివర్సిటీల్లో అసిస్టెండ్ ప్రొఫెసర్లు, కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు ఎలిజిబులిటీ పరీక్షగా సెట్ నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సెట్ లేదా పీహెచ్డీ తప్పనిసరి అర్హతగా ఉంటుంది. తెలంగాణ వరుసగా రిలీజవుతున్న ఉద్యోగ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ల నేపథ్యంలో తెలంగాణ సెట్ కీలకం కానుంది. తెలంగాణలో 2019లో చివరిసారిగా ఈ పరీక్ష నిర్వహించారు. మూడేళ్ళుగా ఈ పరీక్ష మళ్లీ నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే పరీక్ష నిర్వహించేందకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా సెట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 30 నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు టీఎస్‌సెట్ ఆఫీస్ ప్రకటన విడుదల చేసింది. మార్చిలో ఈ పరీక్ష నిర్వహించే అవకాశాలున్నాయి.
http://www.telanganaset.org/