తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 207 ఖాళీల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ ను జారీ చేసింది TSPSC. వెటర్నరీ అండ్ యానిమల్ హజ్బండరీ డిపార్ట్మెంట్లో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (CLASS-A & B), డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ కింద 22 హార్టికల్చర్ ఆఫీసర్ ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. మొదటి ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 30వ తేదీన ప్రారంభం కానుంది.
దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 19ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. హార్టికల్చర్ ఆఫీసర్ ఖాళీలకు గాను దరఖాస్తుల ప్రక్రియ జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 24ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు www.tspsc.gov.in వెబ్ సైట్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం కూడా అదే వెబ్ సైట్ ను సందర్శించాలని అధికారులు సూచించారు.